పోలీసులపై యువతుల వీరంగం | Young Girls Messed With Traffic Police In Karnataka | Sakshi
Sakshi News home page

యువతుల వీరంగం

Jan 4 2021 9:03 AM | Updated on Jan 4 2021 9:36 AM

Young Girls Messed With Traffic Police In Karnataka - Sakshi

దీంతో ఆగ్రహించిన యువతులు పోలీసులతో వాద్వాదానికి దిగి దుర్భాషలాడారు...

సాక్షి, బెంగళూరు : ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసినందుకు ఫైన్‌ వేసిన పోలీసులతో యువతులు అసభ్యంగా మాట్లాడుతూ దుర్భాషలాడిన సంఘటన  దొడ్డబళ్లాపురం నందికొండ చెక్‌పోస్టు వద్ద చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం నలుగురు యువతులు బెంగళూరు నుండి స్కూటీలపై హెల్మెట్‌ కూడా ధరించకుండా నందికొండకు వచ్చారు. కొండకు వెళ్లే మార్గంలో చెక్‌పోస్టు వద్ద చెకింగ్‌ చేస్తున్న పోలీసులు యువతులను నిలిపి హెల్మెట్‌ ధరించనందుకు ఫైన్‌ వేశారు. దీంతో ఆగ్రహించిన యువతులు పోలీసులతో వాద్వాదానికి దిగి దుర్భాషలాడారు. ఫైన్లు కట్టమంటూ మొండికేసారు. పోలీసులు మాత్రం సహనం కోల్పోకుండా ఫైన్‌లకు సంబంధించి రసీదులు ఇచ్చి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement