కరీంనగర్ : ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరిచాడంటూ ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. వివరాలివీ... రామగుండం ఐదో డివిజన్‌లో ఉండే బూర్ల సతీష్(27), గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన మాధవి(27) ఒకే కంప్యూటర్ ఇని స్టిట్యూట్‌కు వెళ్లేవారు. ఆ సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని సతీష్ మాటిచ్చాడు. కానీ ఇటీవల అతడు మాధవిని పట్టించుకోవటం మానేశాడు. దీంతో ఆమె మంగళవారం ఉదయం సతీష్ ఇంటి వద్ద ధర్నాకు దిగింది. దీంతో సతీష్ కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
(రామగుండం)