
నాగరాణి మృతదేహం
తూప్రాన్: అనుమానాస్పద స్థితిలో యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తూప్రాన్ డివిజన్ కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగార్జునగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన సోమన్నగారి భిక్షపతిగౌడ్, లక్ష్మి దంపతుల కుమార్తె నాగరాణి(18) మనోహరాబాద్ మండలం లింగరెడ్డిపేట గ్రామ సమీపంలోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనలియర్ చదువుతుంది.
ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలోఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నాగరాణి మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఎస్‌ఐ నాగార్జునగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణచేపట్టారు. మృతురాలి తండ్రి భిక్షపతిగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.