
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలోని నందలూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. గురువారం ఆడపూరు గ్రామానికి చెందిన కొప్పలి వెంటసుబ్బయ్య(65)ను అరీఫా అనే యువతి పాశవికంగా హత్య చేసింది. అతని నోట్లో పురుగుల మందు పోసి, గొంతు నులిమి, కళ్లను పొడిచి అతి దారుణంగా చంపేసింది. సమాచారం అందుకున్న నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హత్య చేయడానికి ప్రేరేపించిన కారణాలను విచారిస్తున్నారు.