
38ఏళ్ల మహిళపై అత్యాచారం, నిందితుల అరెస్ట్
ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. ఈ సంఘటన గురువారం కేపీహెచ్‌బీలోని వెంకటేశ్వరాకాలనీలో జరిగింది.
హైదరాబాద్: కీచకల పరంపర కొనసాగుతోంది. మహిళలపై అత్యాచార సంఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అత్యాచారాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఈ ఘటనలు ఆగడం లేదు. తాజాగా ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. ఈ సంఘటన గురువారం కేపీహెచ్‌బీలోని వెంకటేశ్వరాకాలనీలో జరిగింది.
వివరాలు.. వెంకటేశ్వర కాలనీకి చెందిన 38 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్, వెంకటేశ్, అత్యాచారం చేశారు. బాధితురాలు కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.