
సాక్షి, హైదరాబాద్: ఫిల్మ్ నగర్‌లో ఓ యువతి మద్యం మత్తులో హాల్‌చల్ చేసింది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అంతేకాక ఆ యువతి కారు దిగి పోలీసులు, మీడియాపై రాళ్లతో దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకుంది. వివరాలివి.. నగరంలో ఫిల్మ్‌నగర్ సహా ఏడు ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తాగి డ్రైవింగ్ చేస్తున్న మందుబాబులను పోలీసులు పట్టుకున్నారు. దాదాపుగా 80 కేసులు నమోదు అయినట్లు ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.
యువతి, ఆమె స్నేహితుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. ఆ యువతి పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. మహిళా పోలీసులు రంగంలోకి దిగి ఆమెను ఆదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment