16 గంటలు నరకం చూసిన యువతి | Boyfriend Acid And Petrol Attack On Young Girl In Mumbai | Sakshi
Sakshi News home page

16 గంటలు నరకం చూసిన యువతి

Published Sun, Nov 15 2020 5:03 PM | Last Updated on Sun, Nov 15 2020 8:56 PM

Boyfriend Acid And Petrol Attack On Young Girl In Mumbai - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ప్రియుడి చేతిలో యాసిడ్‌, పెట్రోల్‌ దాడికి గురైన యువతి 16 గంటల పాటు నరకం అనుభవించింది. సహాయం చేసే వారు లేక రోడ్డు ప్రక్కన ప్రాణాల కోసం అల్లాడిపోయింది. చివరకు ఆసుపత్రిలో చేరి కన్నుమూసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాంధేడ్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అవినాష్‌ ఆర్‌ రాజురే.. సావిత‍్ర డి. అన్కుల్కర్‌లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసే ఉంటుంన్నారు. శుక్రవారం దీపావళి పండుగ జరుపుకోవటానికి పూనేనుంచి నాంధేడ్‌ జిల్లాలోని సొంత ఊరు సెల్గాన్‌ గ్రామానికి బైకుపై బయలుదేరారు. మార్గం మధ్యలో నిర్మానుష ప్రాంతంలో వాహానాన్ని నిలిపిన రాజురే సావిత్రపై దాడికి దిగాడు. ఆమె గొంతునులిమి చంపాలని చూశాడు.  ( చెరువులో శవమైన నాలుగేళ్ల చిన్నారి)

ప్రతిదాడి చేయటంతో సావిత్రపై యాసిడ్‌ పోశాడు. భరించలేని నొప్పితో సహాయం కోసం అరుస్తూ.. కిందపడి కొట్టుకుంటున్నా దయలేకుండా బైకులోని పెట్రోల్‌ తీసి ఆమెపై పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. శనివారం మధ్యాహ్నం ఓ గొర్రెల కాపరి కాలిన గాయాలతో ఉన్న ఆమెను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 16 గంటల సుధీర్ఘ నరకం తర్వాత అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement