
కల్యాణి
మిరుదొడ్డి(దుబ్బాక): ఓ యువతి అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని మల్లుపల్లిలో చోటు చేసుకుంది. మిరుదొడ్డి ఎస్‌ఐ విజయభాస్కర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మచ్చ ఎల్లవ్వ, స్వామి కూతురు కల్యాణి ఈ నెల 8న ఉదయం 10 గంటలకు బొప్పాపూర్‌లోని తన చిన్నమ్మగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. నాటి నుంచి ఆమె ఆచూకీ ఎక్కడా లభించలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఫలితం లేదు. యువతి తల్లి ఎల్లవ్వ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment