గుడికి వెళ్లింది.. అదృశ్యమైంది..! | young girl went temple few days back, missing in hyderabad | Sakshi
Sakshi News home page

గుడికి వెళ్లింది.. అదృశ్యమైంది..!

Published Tue, Feb 13 2018 4:53 PM | Last Updated on Tue, Sep 4 2018 5:37 PM

young girl went temple few days back, missing in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేవాలయానికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఈ సంఘటన ఎల్‌బీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎల్‌బీ నగర్‌ మజీద్‌గల్లీలో ఉండే ఆమని(22) ఈ నెల 7న బాలాజీ గుడికి పోతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆచూకి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement