పోకిరీ వేధింపులు తట్టుకోలేక కృష్ణవేణి(18) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.
ఆదిలాబాద్: పోకిరీ వేధింపులు తట్టుకోలేక కృష్ణవేణి(18) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అదిలాబాద్ పట్టణంలోని టైలర్స్‌కాలని లో కలకలం సృష్టించింది. స్థానిక కళాశాలలో కృష్ణవేణి ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. అదే కాలనీకి చెందిన వెంకట్ అనే యువకుడు గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ యువతి గురువారం ఆత్మహత్యకు పాల్పడింది.