పిడుగుపాటుతో ఒక యువతి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
-మరో ఇద్దరి పరిస్థితి విషమం
ఆదిలాబాద్(కాగజ్‌నగర్): పిడుగుపాటుతో ఒక యువతి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని మాలిని పంచాయతీ పరిధిలోని ఆలీగూడలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ముగ్గురు యువతులు పొలం పనులకు వెళ్లారు. ఇంతలో వర్షం రావడంతో సమీపంలోని చింతచెట్టు కిందికి వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడటంతో గిరుజాబాయి(18), అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
ఆమెతో పాటు ఉన్న ఇద్దరు స్నేహితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన గ్రామస్తులు ఇద్దరు యువతులను ఆస్పత్రికి తరలించారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆస్పత్రికి తరలించడానికి కొంత ఆలస్యం అయినట్లు సమాచారం.