సాక్షి, అమరావతి: దిశ చట్టం ప్రతులు నారా లోకేష్ చింపడం దారుణమని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గతంలో ఎప్పుడైనా టీడీపీ ప్రభుత్వం ఇలాంటి చట్టం తీసుకొచ్చిందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో, శాసన మండలిలో దిశ చట్టాన్ని ఆమోదించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అనూషపై యాసిడ్ దాడి జరిగితే పరిహారం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పరిహారం కోసం విమర్శలు చెస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారని, వాళ్ల ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరిగితే ఏనాడు టీడీపీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు.
ఈ రోజు మహిళల కోసం తమపై విమర్శలు చేస్తే ఎవరూ నమ్మరని, దిశ చట్టంతో పాటు మహిళలకు నేరాలు జరగకుండా కాపాడేందుకు దిశ యాప్‌ను తీసుకొచ్చామని వెల్లడించారు. తమ ప్రభుత్వం నమ్మకం కలిగించడం వలన మహిళలు ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. గతంలో మహిళలపై కేసుల విచారణకు 4 నెలలు పట్టేది కానీ ఈ ఏడాది 40 రోజులలోనే విచారణ పూర్తి చేసిన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు మహిళలపై దాడులు జరిగితే వారం రోజుల్లోనే చాలా కేసుల్లో విచారణ పూర్తి చేశామని మంత్రి తానేటి వనిత తెలిపారు.
చదవండి: నెల్లూరు: యువతిపై దాడి చేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment