Disha Act
-
ఏపీలో దిశా చట్టం ఉందా లేదా?
-
చట్టాలు చేస్తే చాలా?
దేశాన్ని కదిలించిన ‘అభయ’ ఉదంతం దెబ్బతో బెంగాల్ కొత్త కఠిన చట్టంతో ముందుకొచ్చింది. అత్యాచార దోషులకు ఏకంగా మరణశిక్ష వేయాలంటూ మమతా బెనర్జీ సర్కార్ అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత’ను తీసుకొచ్చింది. కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ మహిళా డాక్టర్ ఒకరిని గత నెలలో దారుణంగా రేప్ చేసి, చంపేసిన ఘటనతో రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమైన బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది. దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వరమే న్యాయాన్ని అందించి, దోషులకు కఠిన శిక్షలు విధించడానికే ఈ కొత్త బిల్లు తెచ్చామని సర్కార్ చెబుతోంది. బాధిత మహిళల బిల్లు గనక ప్రతిపక్షాలన్నీ కాదనే ధైర్యం చేయలేక తలూపుతూనే, మమత రాజీనామా డిమాండ్‌ను విడవకుండా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఆమోదం పొందితే కానీ బిల్లు చట్టం కాదు గనక, బాధ్యత కేంద్రం మీదకు నెట్టేసి రాజకీయంగా మార్కులు సంపాదించే పనిలో మమత ముందడుగు వేస్తున్నారు. అత్యాచారాలు, లైంగిక నేరాల నుంచి మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పించే విధంగా చేపట్టిన ‘అపరాజిత మహిళా, శిశు రక్షణ బిల్లు–2024’లో మమత సర్కార్ పలు కొత్త అంశాలను పొందుపరిచింది. 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసేందుకు వీలుగా అపరాజిత టాస్క్‌ఫోర్స్ పేరిట ప్రత్యేక పోలీసు బలగాన్ని ఏర్పాటు చేస్తుందీ బిల్లు. కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త న్యాయచట్టాలు భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), అలాగే పోక్సో చట్టంలోని అంశాలను మించినవి కొన్ని ‘అపరాజిత’లో ఉన్నాయి. పోక్సో కింద 3 నుంచి 5 ఏళ్ళ జైలుశిక్ష, జరిమానా విధించేందుకే వీలుండగా, ఈ సరికొత్త బెంగాల్ అత్యాచార నిరోధక బిల్లు కింద 7 నుంచి పదేళ్ళ శిక్ష తప్పదు. పోక్సో కింద బాధిత చిన్నారి సాక్ష్యాన్ని 30 రోజులలోగా రికార్డ్ చేసి, ఏడాది లోగా విచారణ పూర్తి చేయవచ్చు. అపరాజిత మాత్రం వారం రోజుల్లోనే సాక్ష్యం రికార్డు చేయడం, నెల రోజుల్లో ప్రత్యేక కోర్ట్ విచారణ పూర్తి తప్పనిసరి చేసింది. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించేందుకు ఈ బిల్లు ఉపయుక్తమే. అలాగే, అత్యాచార దోషులకు పెరోల్ సైతం లేని యావజ్జీవ కారాగారవాస శిక్ష తప్పదు. రేప్, లేదా గ్యాంగ్‌రేప్ ద్వారా బాధితుల మరణానికో, జీవచ్ఛవంగా మారడానికో కారణమైన దోషులకు ఉరిశిక్ష విధింపు కూడా కోపోద్రిక్త ప్రజానీకానికి కొంత ఊరట. అలా బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్లకు మించి కఠినంగా ఈ కొత్త బిల్లును తీర్చిదిద్దడం నేరగాళ్ళకు సింహస్వప్నమే. అందుకే, అపరాజిత బిల్లును కనీవినీ ఎరుగని ప్రయత్నంగా పేర్కొంటూ, ‘‘దేశానికి మార్గదర్శి బెంగాల్’’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతోంది. మహిళలపై నేరాలను ఏ మాత్రం సహించని వ్యక్తిగా, నాయకురాలిగా దీదీని చూపించే ప్రయత్నమూ జరుగుతోంది. కానీ, అదే సమయంలో దిగజారు తున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే ఆమె ఈ బిల్లు తెచ్చారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అభిప్రా యాలు, అనివార్యతలు ఏమైనా... స్త్రీలు, పిల్లల రక్షణకంటూ చేసే ఏ సర్కారీ కొత్త ప్రయత్నాన్ని తీసిపారేయాల్సిన పని లేదు. ప్రతి చర్యనూ స్వాగతించాల్సిందే. నిజానికి, మహిళల రక్షణ నిమిత్తం 2019లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రాత్మకమైన ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. 2020లో మహారాష్ట్ర సైతం అత్యాచార బాధిత స్త్రీల పక్షాన నిలుస్తూ, దోషులకు కఠినశిక్షలతో ‘శక్తి’ బిల్లు పాస్ చేసింది. శాంతిభద్రతలే కాదు... సాధారణ ప్రజాపరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే గనక స్థానికంగా ఇలాంటి కట్టుదిట్టమైన శాసన నిర్మాణాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ చట్టాలన్నీ గవర్నర్ వద్దో, లేదంటే ఆపైన రాష్ట్రపతి వద్దో ఆఖరి ఆమోదముద్ర కోసం నేటికీ ఎదురుచూస్తూనే ఉండడం విషాదం. తాజా అపరాజితకూ ఆ గతి తప్పకపోవచ్చు. రాష్ట్రస్థాయిలో చేస్తున్న ఈ తరహా చట్టాలకు ఆమోదం తెలపడానికి ఢిల్లీ గద్దె మీది పెద్దలకు అభ్యంతరం ఎందుకో అర్థం కాదు. మహిళా పరిరక్షకులమనే ఘనత తమకే దక్కాలన్న రాజకీయాలే తప్ప, ఇతరేతర కారణాలూ కనబడడం లేదు. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లు సైతం తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వీధికెక్కి పోరాడినా, చీమ కుట్టినట్టయినా లేని పాలకుల నుంచి ఇంకేం ఆశించగలం? ఆ మాటకొస్తే స్త్రీలకు అండగా తామున్నామని ఢిల్లీ పెద్దలు ఆచరణలో నమ్మకం కలిగించలేకపోవడం కూడా రాష్ట్రాల్లో కొత్త చట్టాలకు కారణమని విస్మరించలేం. కఠిన చట్టాలు చేయడం మంచిదే కానీ, కేవలం చట్టాల రూపకల్పనతో లక్ష్యం నెరవేరుతుందా అన్నది బేతాళప్రశ్న. కొన్ని లోటుపాట్లున్నా పాత చట్టాల మొదలు పుష్కరకాలం క్రితపు ‘నిర్భయ’ చట్టం దాకా మన దగ్గర చట్టాలకు కొదవ లేదు. అమలులో చిత్తశుద్ధి లోపమే సమస్య. అపరిచితు లొచ్చి అత్యాచారం జరిపేలా అభద్ర వాతావరణం, అసమర్థ గస్తీ, అధ్వాన్న దర్యాప్తు నెలకొన్నాయంటే ఆ తప్పు పాలకులదేగా! అదే సమయంలో సామాజికంగా, సాంస్కృతికంగా మనుషుల మానసిక కాలుష్యానికి కారణమై, నేరాలకు ప్రేరేపిస్తున్న అంశాలను అరికట్టేందుకు నిజాయతీగా మనందరం చేస్తున్నదేమిటో ఆలోచించుకోవాలి. ఆత్మపరిశీలనా చేసుకోవాలి. ప్రతిపక్ష పాలిత కోల్ కతాలో ‘అభయ’ జరిగిందని బీజేపీ, అధికార బీజేపీ పాలిత హాథ్రస్, ఉన్నావ్‌లలో జరిగిందేమిటని విపక్షాలు పరస్పర దూషణలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రాజకీయంగా పైచేయికై పోరాడే కన్నా సురక్షితమైన పాఠశాలలు, పనిప్రదేశాలు, సత్వరం స్పందించే రక్షక వ్యవస్థ లాంటి ప్రాథమిక అంశాలపై దృష్టి పెడితే అందరికీ మంచిది. అది లేకపోవడమే అసలు సమస్య. -
ఉద్యోగినిపై వేధింపులు.. దిశ పోలీసులకు కాల్.. ఆరు నిమిషాల్లోనే
శ్రీకాకుళం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన దిశ చట్టం, ఎస్ఓఎస్ యాప్ సత్ఫలితాలనిస్తున్నాయి. తాజాగా పొందూరు మండలంలో బుధవారం జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పొందూరు మండలంలో పనిచేస్తున్న ఉద్యోగినిని రణస్థలం మండలం కోటపాలెం సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఎ.ధర్మారావు వేధింపులకు గురిచేశాడు. బైక్‌పై ఉద్యోగానికి వెళ్తున్న యువతిని రాపాక జంక్షన్ వద్ద అడ్డగించి బెదిరించాడు. వెంటనే అమ్మాయి ప్రాణభయంతో దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసి సహాయం కోరింది. దీంతో ఆరు నిమిషాల్లో సంఘటనా స్థలానికి దిశ పోలీసులు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని బాధితురాలికి భరోసా కల్పించారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మాయని మచ్చగా తొండుపల్లి ఘటన.. ఆ అమానుషానికి మూడేళ్లు
ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది.. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది.. నలుగురు కామాంధులు చేసిన వికృత చేష్టలకు సమాజం దిగ్బ్రాంతికి గురైంది. దిశ ఉదంతం.. పోలీసులకు కొత్త దిశను చూపింది.. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై షాద్‌నగర్ శివారులో ముగిసిన దిశ విషాదం వెలుగు చూసి నేటికీ మూడేళ్లు పూర్తయింది. ఆమె మరణం.. మహిళా రక్షణ కొత్త చట్టాలకు దిశా నిర్దేశం చేసింది. మహిళల దశ మార్చే న్యాయసహాయకులకు, నిఖార్సైననిర్ణయాలకు రూపకల్పన చేసింది. అమానుషమైన నాటి ఘటన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఓ సారి గుర్తు చేసుకుంటే.. – షాద్‌నగర్ 2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయం.. దిశ అనే యువతి అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపింది. అక్కడి నుంచి పని మీద వెళ్లింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. అంతలోనే నలుగురు కామాంధులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని నిందితులు లారీలో తీసుకొచ్చి షాద్‌నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు. అయితే 2019 డిసెంబర్ 6 తెల్లవారుజామున సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్ధలానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి వారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేయడం మరో సంచలనం అయ్యింది. దిశ హత్య ఘటన జనాలను ఎంతగా కదిలించిందంటే ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరూ సమర్తిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాదు దిశ హత్య ఉదంతం కొత్త చట్టాలకు దిశానిర్దేశం చేసింది. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూకర్ సీబీఐ మాజీ డైరక్టర్ కార్తీకేయన్, వీఎన్ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ పూర్తి చేసి నివేదికను సుప్రీం కోర్టుకు అందజేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కొనసాగుతోంది. మారిన చట్టాలు దుర్మార్గుల చేతిలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయిన దిశ పేరిట కొత్త చట్టాలను ప్రభుత్వాలు తీసుకొచ్చారు. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్ధలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లను, పోలీసు వ్యవస్థను, ఏర్పాటు చేశారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలపై కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్‌లో సైతం వేగం పెంచారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ల ప్రభావం కారణంగా మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల వంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. అప్రమత్తత అవసరం సమాజంలో ఇంకా అక్కడక్కడా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న, కల్పిస్తున్న సదుపాయాలను యువతులు, మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా ఒంటరిగా ఉన్న సమయంలో, రాత్రివేళల్లో బయటకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సేవలను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
మహిళలను శక్తివంతంగా తీర్చి దిద్దాలన్నది సీఎం జగన్ సంకల్పం
-
దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్
నెల్లూరు (క్రైమ్): మహిళల రక్షణకు రూపొందించిన దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో అన్ని పోలీస్స్టేషన్లలో పరిధిలో బుధవారం నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా పోలీసు లు బృందాలుగా ఏర్పడి అంగన్వాడీ, ఆశ వర్క ర్లు, వలంటీర్ల సహకారంతో మహిళలు, యువతులు, విద్యార్థినులకు యాప్‌పై విస్తృత అవగాహన కల్పించారు. గంటల వ్యవధిలోనే లక్ష మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. స్థానిక ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొన్న ప్రముఖులు, మహిళలు, యువత, ప్రజలకు దిశ యాప్ పని తీరును వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. అందులో భాగంగా దిశ చట్టం, దిశ మొబైల్ యాప్‌ను రూపొందించిందన్నారు. దేశంలోని అన్నీ అత్యవసర యాప్‌ల్లో కెల్లా దిశ యాప్ అత్యున్నతమైందన్నారు. దిశ యాప్ ఉంటే పోలీసులు మీ వెన్నంటే ఉనట్లేన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. ఎవరికి ఏ సమయంలో ఆపద వస్తుందో తెలియదని, నాకేం కాదని అనుకోవడం సరికాదన్నారు. ప్రతి మహిళ, యువతి తమ ఫోన్లలో యాప్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆపద సమయంలో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, ఫోనును నాలుగైదుసార్లు ఊపినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుందని, సిబ్బంది అప్రమత్తమై నిమిషాల్లోనే చేరుకుని రక్షణ చర్యలు చేపడుతారన్నారు. యాప్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి మహిళ ఆపద సమయంలో దానిని ఉపయోగించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. దిశ యాప్ విశిష్టతను వివరించిన విద్యార్థినులకు ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. స్వర్ణవేదికలో మెగా డ్రైవ్‌లో ఎస్పీ పాల్గొని మహిళలనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్ డి. హిమవతి, ఏఎస్పీ క్రైమ్స్ కె.చౌడేశ్వరి, ఏఆర్ ఏఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ కోటారెడ్డి పాల్గొన్నారు. నగరంలో.. నెల్లూరులోని ఆరు పోలీసుస్టేషన్లు, ట్రాఫిక్, సీసీఎస్ పోలీసుస్టేషన్ల పరిధిలో మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ జరిగింది. నగర ఇన్స్పెక్టర్లు వీరంద్రబాబు, టీవీ సుబ్బారావు, అన్వర్‌బాషా, దశరథరామారావు, కె. నరసింహరావు, కె, రామకృష్ణ, సౌత్, నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు జి. రామారావు, రాములునాయక్ తమ స్టేషన్ల పరిధిలో అవగాహన, రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. -
దిశ యాప్ నొక్కగానే వెంటనే స్పందించాలి: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దిశ యాప్, చట్టం అమలుపై సీఎం వైఎస్ జగన్ నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. ఏపీలో ప్రతి మహిళా క్షేమం, సంక్షేమం అనే నినాదంతో ముందుకెళ్ళాలని సూచించారు. నేర నిరోధం కోసం సమస్యాత్మక ప్రాంతాలలో అతి త్వరలో 163 దిశ పెట్రోలింగ్ వెహికల్స్ ప్రారంభించనున్నట్లుగా సీఎం జగన్ ప్రకటించారు. వీటితో పాటు 18 దిశ మొబైల్ రెస్ట్‌రూమ్స్ అందుబాటులోకి రానున్నట్లుగా వెల్లడించారు. ప్రతి మహిళా దిశ యాప్ వినియోగించాలి అని సూచించారు. దిశ యాప్ నొక్కగానే పోలీసులు వెంటనే స్పందించాలని, అతి తక్కువ సమయంలో ఘటన స్థలానికి చేరుకుని ఆపన్నహస్తం అందించాలని ఆదేశించారు. దిశ పీఎస్‌కు వచ్చే ప్రతీ కేస్ కూడా శిక్ష పడేవరకూ రెగ్యులర్‌గా మానిటర్ చేయాలి, ఎప్పటికప్పుడు బాధితులతో మాట్లాడి వారికి స్వాంతన కలిగించాలి అన్నారు. కన్విక్షన్ పెరిగే దిశగా త్వరితగతిన ఎవిడెన్స్ సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటివరకూ 92.7 శాతం కేసులు చార్జిషీట్లు వేసినట్లు సీఎంకి అధికారులు వివరించారు. దిశ పై సోషల్ మీడియా ద్వారా కెపాసిటీ బిల్డింగ్ చేయడంతో పాటు, పనితీరు మెరుగుపరిచేలా రోజువారీ సమీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామ వలంటీర్, మహిళా పోలీస్‌ను భాగస్వామ్యం చేయాలి, ప్రతీ 15 రోజులకోసారి దిశపై హైపవర్ కమిటీ రివ్యూ చేయాలన్నారు. దిశ యాప్ ద్వారా వచ్చే కాల్స్, కేసుల్లో ఎట్టి పరిస్ధితుల్లో అలసత్వం ప్రదర్శించకూడదని అన్నారు. ఒకవేళ అలా జరిగితే కఠిన చర్యలు తప్పవని సీఎం జగన్ హెచ్చరించారు. ఇప్పటి వరకూ 1.16 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేశారని అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ కే.రాజేంద్రనాథ్ రెడ్డి, డీఐజీ టెక్నికల్ సర్వీసెస్ పాలరాజు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏపీలో ‘దిశ’లాగే మహారాష్ట్రలో ‘శక్తి’..
సాక్షి, ముంబై: మొదటి రోజు మాదిరిగానే రెండో రోజూ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాపీ (అనుకరణ), మాఫీతో గరంగరంగా సాగిన కార్యకలాపాలు రెండో రోజు కూడా దాదాపు అలాగే కొనసాగాయి. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ప్రారంభమైన గురువారం నాటి సభా కార్యకలాపాలు చివరకు ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకోసం తీసుకువచ్చిన ‘దిశ’ లాంటి చట్టాన్ని ‘శక్తి’ పేరుతో అమలు చేయాలనే ప్రతిపాదనను ఆమోదించుకున్నాయి. ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి. ఇదిలాఉండగా సభ కార్యకలాపాల ప్రారంభానికి ముందు ప్రతిపక్ష నేతలందరూ అసెంబ్లీ హాలులోకి వెళ్లే మెట్లపై కూర్చున్నారు. అదే సమయంలో పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే రావడంతో మెట్లపై గుంపులో కూర్చున్న ఎమ్మెల్యే నితేశ్ రాణే ఆయన్ని చూస్తూ మ్యావ్, మ్యావ్ అంటూ శబ్ధం చేశారు. ఒకప్పుడు పులిలా గాండ్రించే శివసేన పార్టీ ఇప్పుడు పిల్లిలా మారిందని, దీన్ని గుర్తు చేయడానికే ఇలా మ్యావ్, మ్యావ్ మంటూ శబ్ధం చేశానని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆదిత్య ఠాక్రే నితేశ్ రాణేను పట్టించుకోకుండా నేరుగా ముందుకు వెళ్లిపోయారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే సభా ప్రాంగణంలో కొందరు సభ్యులు మాస్క్ లేకుండా తిరుగుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గమనించారు. దీంతో మాస్క్ ధరించని సభ్యులను (పరోక్షంగా బీజేపీ నాయకులు) సభ నుంచి బయటకు పంపించాలని డిప్యూటీ స్పీకర్ నరహరి జిరావల్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ ప్రభూ మాట్లాడుతూ ఆదిత్య ఠాక్రేకు వాట్సాప్‌లో బెంగళూర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని, అది కర్నాటక నుంచే వచ్చిందని అన్నారు. చదవండి: (‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్) గతంలో దాబోల్కర్, పాన్సారేలను హత్య చేసిన హంతకులకు కర్నాటకతో సంబంధాలున్నాయి. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుందని ఘటనకు ముడిపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సునీల్ ప్రభూ ఈ అంశాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని, అవసరమైతే తాను స్వయంగా కర్నాటక ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఫడ్నవీస్ సభకు స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన హంతకులతో సంబంధాలున్నట్లా? అన్ని ప్రశ్నిస్తూనే, సాక్షాలు లేనిదే అనవసరంగా ఆరోపణలు చేయవద్దని సభ్యులకు ఫడ్నవీస్ హితవు పలికారు. చదవండి: (Flight Charges: విమాన చార్జీల మోత) కొత్త చట్టంతో మహిళలకు సత్వర న్యాయం మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాల ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్నా, నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం మాదరిగానే ‘శక్తి’ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎమ్మెల్యే అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. ఆ ప్రకారం శక్తి చట్టాన్ని అమలుచేసేందుకు రూపొం దించిన బిల్లుపై గత సంవత్సరం జరిగిన ఆర్థిక బడ్జెట్ సమావేశాల్లో చర్చించారు. ఈ చట్టం ద్వారా సమాజంలో మహిళలపై జరిగే వేధింపు లు, యాసిడ్ దాడులు, అసభ్యకర ప్రవర్తన తదిత ర నేరాలపై నాన్‌బెయిల్ కేసు నమోదు చేస్తారు. కేసు నమోదు చేసిన నెల రోజుల్లోనే విచారణ జరిపి తీర్పు వెల్లడించడం, ప్రతి జిల్లాలో దీనికోసం స్వతంత్రంగా దర్యాప్తు సంస్ధలు, ప్రత్యేక కోర్టులు స్ధాపించడం లాంటివి ఈ చట్టం ద్వారా సాధ్యమవుతుంది. రెండోరోజు జరిగిన సమావేశంలో శక్తి చట్టాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించుకున్నాయి. అందుకు ప్రతిపక్షాలు కూడా సహకరించాయి. దీంతో ఇకనుంచి యాసి డ్ దాడులు, సామూహిక అత్యాచారం, హత్య చేసిన నిందితులకు సత్వరమే శిక్షలు విధించేందుకు ప్రత్యేక కోర్టు స్ధాపించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజీత్ పవార్ సభకు వెల్లడించారు. -
Andhra Pradesh: దశ ‘దిశ’లా భద్రత
ఆపదలో చిక్కుకున్న మహిళలు సహాయం కోరిన వెంటనే అక్కడకు పోలీసులు చేరుకుని రక్షణ కల్పించే వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించింది. అదే ‘దిశ’ మొబైల్ యాప్. మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం ప్రకారం పోలీసు శాఖ ‘దిశ’ యాప్‌ను రూపొందించింది. ఎన్నో వినూత్నమైన ఫీచర్లతో రూపొందించిన ఈ యాప్ ఆధునిక సాంకేతిక వ్యవస్థతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొందింది. కిందటేడాది ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘దిశ’యాప్‌ను ఆవిష్కరించారు. కరోనా ప్రభావం తగ్గాక ఈ ఏడాది జూన్ 29న విజయవాడలో ‘దిశ’ యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యాప్ ఆవశ్యకతను వివరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బ్లాక్ మెయిలర్ ఆటకట్టు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రసన్నకుమార్ అనే వ్యక్తి అదే జిల్లాకు చెందిన ఓ వివాహితను అసభ్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలి నుంచి నగలు దోపిడీ చేయడంతో పాటు ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలను బహిర్గతం చేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలు తన మొబైల్ ఫోన్లోని దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఆమె వద్దకు చేరుకున్నారు. నిందితుడి ఫోన్‌ను ట్రాక్ చేసి హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ మరో యువతిని బెదిరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ చదువుతూ మధ్యలో నిలిపివేసిన నిందితుడు గతంలో పలు మోసాలు, దొంగతనాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతడి ఫోన్లోని వీడియోలు, కాల్‌డేటాను తనిఖీ చేయగా దాదాపు 200 మంది మహిళలు, 100 మంది యువతులను బెదిరించి డబ్బులు లాగినట్టు వెలుగులోకి వచ్చింది. పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితురాలు ‘దిశ’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో నిందితుడు చిక్కాడు. దిశ పెట్రోలింగ్ వ్యవస్థ మీద అవగాహన కల్పించేందుకు మచిలీపట్నంలో మహిళా పోలీసుల ర్యాలీ (ఫైల్) ఆత్మహత్య నివారణ విజయవాడలోని ఓ మహిళను ఒకరు మాయమాటలతో మోసం చేశారు. దాంతో ఆమె విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడబోయింది. ఆమె తన మొబైల్ ఫోన్లో దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ ను నొక్కింది. పోలీసు కమాండ్ కంట్రోల్ నుంచి ఫోన్ చేసి ఆమెకు వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. జీవితంలో మోసపోయినందున తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మూడేళ్ల కుమార్తెను ఆదుకోవాలని దిశ యాప్ ద్వారా కోరింది. దాంతో పోలీసులు కేవలం 3 నిముషాల్లోనే ఆ ఇంటికి చేరుకుని ఆమెను ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఆమెను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. గృహహింసకు చెక్ విజయవాడ మధురానగర్‌లో ఓ మహిళను ఆమె భర్త దాడి చేసి గాయపరిచాడు. ఆమె దిశ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించగా కేవలం 5 నిమిషాల్లోనే పోలీసులు ఆ ఇంటికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రక్షణ వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ యువతి పరీక్ష రాసేందుకు ఢిల్లీ వెళ్లారు. రైల్లో ఆమెకు పరిచయమైన ఓ దంపతులతో తాను ఢిల్లీలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లాల్సి ఉందని ఆమె చెప్పారు. ఢిల్లీ చేరుకున్న తరువాత ఆ దంపతులు ఆమెను ఓ ఆటో ఎక్కించారు. ఆటో బయల్దేరాక ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేసి, ఆటో డ్రైవర్‌కు అడ్రస్ చెప్పమని ఫోన్ ఇచ్చారు. కానీ ఆ ఆటో డ్రైవర్ ఆటువైపు మాట్లాడుతోంది ఆమెను ఆటో ఎక్కించిన దంపతులని భావించి, హిందీలో ఏదో మాట్లాడుతుండటంతో ఆమె స్నేహితురాలికి అసలు విషయం తెలిసి, వెంటనే తన స్నేహితురాలిని ఆటో దిగిపోవాలని చెప్పింది. ఆమె ఆటో ఆపాలని కోరినా అతను ఆపలేదు. దాంతో వేగంగా వెళ్తున్న ఆటో నుంచి కిందకు దూకేసి, తన మొబైల్ ఫోన్లో దిశ యాప్‌ను నొక్కడంతో కడప పోలీసులు వెంటనే స్పందించి, ఢిల్లీలోని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఆమెకు అక్కడ ఆశ్రయం కల్పించారు. ఆ మర్నాడు ఆమెను పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లి, పరీక్ష రాశాక ఆమెను సురక్షితంగా ఢిల్లీలో రైలు ఎక్కించారు. ఆమె తిరిగి తన ఇంటికి సురక్షితంగా చేరుకునేవరకు పోలీసులు ఆమెతో ఫోన్లో టచ్‌లోనే ఉన్నారు. ఆన్లైన్ మోసగాడి నుంచి భద్రత విశాఖ యువతికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తరువాత వేధించడంతో దూరం పెట్టింది. నిందితుడు తాము తీసుకున్న ఫోటోలను అందరికీ చూపిస్తానంటూ బెదిరించాడు. బాధితురాలి ఇంటికి చేరుకుని తలుపులు బాదుతూ వేధించడంతో మధ్యాహ్నం 2.46 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. 2.47 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. 2.55 గంటలకు పోలీసులు అక్కడకు చేరుకుని యువతికి ధైర్యం చెప్పి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాల్యవివాహానికి అడ్డుకట్ట చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో ఓ మైనర్ బాలికకు ఆమె తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నారు. ఆ విద్యార్థిని పెళ్లి వద్దని ఎంత గొడవ చేసినా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. విషయం తెలిసి పొరుగింటిలో ఉండే ఓ మహిళ తన మొబైల్ ఫోన్లో దిశ యాప్ ఎస్‌వోఎస్ బటన్ నొక్కింది. వెంటనే స్పందించిన పోలీసులు కేవలం కొద్ది నిముషాల్లోనే అక్కడకు చేరుకుని ఆ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఆ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. సందేశం ఇచ్చిన క్షణాల్లో రక్షణ దిశ యాప్ తమ మొబైల్ ఫోన్లో ఉంటే చాలు యువతులు, మహిళలకు సదా భద్రత ఉన్నట్టే. తాము ఆపదలో ఉన్నామన్న సందేశం ఇస్తే చాలు... క్షణాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని రక్షణ కల్పిస్తారు. ఆకతాయిల అల్లరి, ఆగంతకులు వేధింపులు, బ్లాక్ మెయిల్, అసభ్య ఫోటోలు, వీడియోలతో బెదిరింపులు, దాడులు, గృహహింస.. ఇలా అన్ని రకాల వేధింపులను అడ్డుకుంటూ మహిళా భద్రతకు దిశ యాప్ భరోసానిస్తోంది. గతంలో మహిళలపై వేధింపుల కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరిగేది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి బాధితులు సందేహించేవారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా పోలీసులు తక్షణం స్పందిస్తారన్న నమ్మకం ఉండేది కాదు. వ్యక్తిగత వివరాలు బహిర్గతమవుతాయని జంకేవారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతూ దిశ యాప్ మహిళలకు రక్షణ కల్పిస్తోంది. ఆపద ఎదురైతే ఆ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కినా, గట్టిగా అటూ ఇటూ ఊపినా చాలు కొద్ది నిమిషాల్లోనే పోలీసుల ద్వారా రక్షణ లభిస్తోంది. రోజూ ఐదు వేల కాల్స్ గతంలో ఎవరైనా సమస్య ఎదురైతే 100 నంబర్‌కు కాల్ చేసేవారు. ఎన్నో ఏళ్లుగా డయల్ 100 కల్పించిన నమ్మకాన్ని దిశ యాప్ అతి తక్కువ వ్యవధిలో సాధిస్తోంది. దిశ యాప్ ద్వారా రోజుకు దాదాపు 5వేల కాల్స్ వస్తున్నాయి. వీటిలో దాదాపు 60 కాల్స్ తగిన చర్యలు తీసుకునేవిగా ఉంటున్నాయి. రోజుకు సగటున 8 వరకు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. 85 లక్షలకు పైగా డౌన్లోడ్స్ ‘దిశ’ యాప్ పట్ల మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అతి తక్కువ కాలంలోనే 85 లక్షల మందికి పైగా ‘దిశ’యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడాన్ని చూస్తే ఈ యాప్ పట్ల మహిళల్లో ఎంతటి నమ్మకం ఉందో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్దేశించినట్లుగా కోటి డౌన్లోడ్లు లక్ష్య సాధన దిశగా ‘దిశ’ దూసుకుపోతోంది. తక్షణ రక్షణ దిశ యాప్ ద్వారా ఇప్పటివరకు 3,98,878 ఎస్‌వోఎస్ కాల్స్ వచ్చాయి. వాటిలో చర్యలు తీసుకోదగ్గ కాల్స్ 6,306 ఉన్నాయి. ఆ కాల్స్‌పై పోలీసులు తక్షణం స్పందించి 100 శాతం మందికి రక్షణ కల్పించారు. సమస్యలను పరిష్కరించారు. 799 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ‘దిశ’ వచ్చిన తరువాత ఇప్పటి వరకు 148 కేసుల్లో దోషులకు శిక్షలు అమలయ్యాయి. సత్వర పరిష్కారంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ దిశ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కేసుల సత్వర పరిష్కారంలో జాతీయ సగటు కంటే మన రాష్ట్రం ఎంతో మెరుగ్గా ఉండటం విశేషం. 2019తో పోలిస్తే 2020లో రాష్ట్రంలో మహిళలపై నేరాలు 4శాతం తగ్గాయి. మహిళలపై నేరాల కేసుల విచారణ 2019లో సగటున 100 రోజులు ఉండగా 2020లో 86 రోజులకు తగ్గింది. ఇక 2021లో ఏకంగా 42 రోజులకు తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహిళలపై దాడుల కేసుల్లో నిర్ణీత గడువు 60రోజుల్లోగా దేశంలో ఈ ఏడాది 35 శాతం కేసుల్లోనే దర్యాప్తు చేశారు. కానీ ఏపీలో మాత్రం ఏకంగా 90.17శాతం కేసుల్లో దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేయడం విశేషం. దిశ యాప్, దిశ వ్యవస్థ జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు గెలుచుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న దిశ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా బృందాలను పంపించాయి. పటిష్ఠ వ్యవస్థ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు నెలకొల్పింది. వాటిలో మహిళల హెల్ప్ డెస్క్, వెయిటింగ్ హాల్, కౌన్సెలింగ్ రూమ్, బాలింతలు బిడ్డలకు పాలుపట్టేందుకు ప్రత్యేక గది... ఇలా పలు సదుపాయాలు కల్పించారు. ఏపీ ప్రభుత్వం రూ.4.50కోట్లతో దిశ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు కల్పించింది. కేసుల సత్వర విచారణకు దిశ ల్యాబ్‌లను బలోపేతం చేసేందుకు అవసరమైన 7 రకాల పరికరాల కొనుగోలు చేసింది. మహిళలపై అత్యాచారాలు, హత్యల కేసుల సత్వర దర్యాప్తు కోసం 7 దిశ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. 58మంది సైంటిఫిక్ అసిస్టెంట్లను నియమించింది. త్వరలో 61మంది ఫోరెన్సిక్ నిపుణులను నియమించనుంది. మొబైల్ ఫోన్లలో వైరస్, మాల్వేర్లను తొలగించేందుకు ’సైబర్ కవచ్’పేరిట 50 సైబర్ కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం ఉన్న 10 కోర్టులకు అదనంగా కొత్తగా 6 కోర్టులను ఏర్పాటు చేస్తోంది. మహిళలపై నేరాల విచారణకు 12 కోర్టులు ఉండగా కడపలో మరో కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. దిశ వ్యవస్థ కోసం ప్రభుత్వం ఇప్పటికే 900 స్కూటర్లను సమకూర్చింది. కొత్తగా 145 స్కార్పియో వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రూ.16.60 కోట్లు మంజూరు చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మంది నుంచి 10మందితో మహిళా మిత్ర బృందాలను ఏర్పాటు చేశారు. ఇతర సహాయం కోసం.. దిశ యాప్‌లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లు కూడా ఉంటాయి. ఈ యాప్‌లోనే పోలీసు అధికారుల నంబర్లు, సమీపంలోని పోలీస్ స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఏర్పాటు చేశారు. ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, ట్రామా కేర్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, మందుల దుకాణాల వివరాలు కూడా ఉన్నాయి. మహిళా భద్రతకు భరోసా: గౌతం సవాంగ్, డీజీపీ, ఏపీ ఏపీలో మహిళల భద్రతలో దిశ యాప్ కీలక భూమిక పోషిస్తోంది. ఆపదలో ఉన్నామని మహిళలు దిశ యాప్ ద్వారా సంప్రదిస్తే గరిష్టంగా ఆరేడు నిముషాల్లోనే పోలీసులు అక్కడకు చేరుకుని రక్షణ కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దిశ వ్యవస్థను సమర్థంగా పనిచేసేందుకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చారు. జాతీయ స్థాయిలో దిశ యాప్‌కు ఎన్నో అవార్డులు లభించాయి. ఎన్నో రాష్ట్రాలు దిశ యాప్ పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏపీకి పంపించి పరిశీలించాయి. సత్వరం దర్యాప్తు జరిపి దోషులను త్వరగా శిక్షించేలా చట్టాన్ని తీసుకు వచ్చేందుకు దిశ బిల్లును కూడా ఏపీ శాసనసభ ఆమోదించి కేంద్రానికి పంపింది. ఆ బిల్లుకు త్వరలో ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నాం. యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ ఇలా.. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘దిశ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. దిశ యాప్‌లో రిజిస్ట్రేషన్ కోసం తమ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ వెంటనే ఒక ఓటీపీ నంబర్ వస్తుంది. దాన్ని యాప్‌లో నమోదు చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దిశ యాప్‌ను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, అధికారులు (ఫైల్) ఆపదలో యాప్ పని చేసేది ఇలా... దిశ యాప్‌లో అత్యవసర సహాయం(ఎస్‌వోఎస్) బటన్ ఉంటుంది. యువతులు, మహిళలు తాము ఆపదలో చిక్కుకున్నారని భావిస్తే వెంటనే యాప్‌ను ఓపెన్ చేసి ఆ ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కాలి. ఆ వెంటనే వారి ఫోన్ నంబర్, చిరునామా, వారు అప్పటికి ఉన్న ప్రదేశం(లొకేషన్)తోసహా మొత్తం సమాచారం దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. ఆ వెంటనే కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమవుతారు. తమకు సందేశం పంపినవారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తారు. ఇక అత్యవసర ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కితే చాలు వారి వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియో కూడా రికార్డ్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పంపుతుంది. యువతులు, మహిళలు విపత్కర పరిస్థితుల్లో తమ ఫోన్లోని దిశ యాప్‌ను ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. వారు తమ ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్ వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్‌లోని అధికారులు, సిబ్బంది జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా వారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి వచ్చి రక్షిస్తారు. అందుకోసం పోలీస్ వాహనాల్లో అమర్చిన ’మొబైల్ డేటా టెర్మినల్’ సహాయపడుతుంది. కుటుంబ సభ్యులకూ సమాచారం యువతులు, మహిళలు తాము ఆపదలో ఉన్నామని భావించినప్పుడు పోలీసులతోపాటు తమ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చే వెసులుబాటు ‘దిశ’యాప్‌లో ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఐదు నంబర్లను ఆ యాప్‌లో ఫీడ్ చేసుకోవచ్చు. దాంతో ఆ ఐదు నంబర్లకు కూడా సమాచారం చేరుతుంది. వారు కూడా వెంటనే పోలీసులను సంప్రదించేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లోనూ రక్షణ... యువతులు, మహిళలు తమ ప్రయాణ సమయాల్లో రక్షణ, మార్గ నిర్దేశం కోసం కూడా దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకోవచ్చును. అందుకోసం ఆ యాప్‌లో ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్‌ను ఏర్పాటు చేశారు. తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని అందులో నమోదు చేయాలి. వారు ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, వారి బంధుమిత్రులకు సమాచారాన్ని పంపుతుంది. దాంతో వారు అప్రమత్తమై రక్షణకు వస్తారు. పుష్ బటన్ ఆప్షన్... యువతులు, మహిళల రక్షణ కోసం వారికి పోలీసులు ఏదైనా సమాచారం పంపించేందుకు కూడా ఈ యాప్‌లో అవకాశం కల్పించారు. అందుకోసం ‘పుష్ బటన్’ ఆప్షన్ ఏర్పాటు చేశారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆధీనంలో ఉండే ఈ ‘పుష్ బటన్’ ఆప్షన్ ద్వారా పోలీసులు అందర్నీ ఒకేసారి అప్రమత్తం చేయవచ్చును. ఆ యాప్ ఉన్న అందరికీ పోలీసుల సందేశం చేరుతుంది. దాంతో యువతులు, మహిళలు మరింత అప్రమత్తంగా ఉండి పోలీసుల సూచనలను పాటిస్తారు. అప్రమత్తం చేసే ఫీచర్ ప్రమాదకర, సున్నిత ప్రాంతాల గురించి మహిళలను ముందే అప్రమత్తం చేసే ఫీచర్‌ను కూడా ఈ యాప్‌లో పొందుపరిచారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న మహిళలు, విద్యార్థినులు లైవ్ ట్రాకింగ్ ఆప్షన్‌ను ఆన్‌లో ఉంచుకోవాలి. తాము ఎక్కడికైనా వెళ్లాల్సిన వస్తే ఆ ప్రాంతాన్ని దిశ యాప్‌లో ఫీడ్ చేయాలి. వారు వెళ్లే మార్గంలో ఎక్కడైనా సున్నిత, ప్రమాదకర ప్రాంతాలు ఉంటే దిశ యాప్ వారిని వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, నిర్మానుష్య ప్రాంతాలు, ఇతర సున్నిత, ప్రమాదక ప్రాంతాలనే విషయాన్ని వారికి ముందే చెబుతుంది. దాంతో ఆ మార్గంలో వెళ్లాలన్న ఆలోచనను విరమించుకోవడంగానీ, తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడంగానీ, బంధుమిత్రుల తోడు తీసుకుని వెళ్లడంగానీ చేస్తారు. దిశ యాప్‌లో ఈ ఫీచర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుగా రాష్ట్రంలోని సున్నిత, ప్రమాదాలకు అవకాశం ఉండే ప్రాంతాలను పోలీసు శాఖ మ్యాపింగ్ చేసి జియో ట్యాగింగ్ చేసింది. వన్‌స్టాప్ సెంటర్లతో బాధిత మహిళలకు పూర్తి వైద్య, న్యాయ సహకారం ఆంధ్రప్రదేశ్‌లో 13 దిశ వన్‌స్టాప్ సెంటర్లను నిర్వహిస్తున్నాం. దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా వచ్చిన కేసుల్లో బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాం. బాధిత మహిళలు, బాలికలకు అవసరమైన వైద్యసహాయాన్ని అందించేలా సహకరిస్తున్నాం. ఆ కేసుల్లో బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి ఉచితంగా పూర్తి న్యాయసహాయం అందిస్తున్నాం. బాధిత బాలికలకు పోక్సో న్యాయస్థానాలకు హాజరయ్యేటప్పుడు వారితో దిశ వన్‌స్టాప్ సెంటర్ల సిబ్బంది తోడు ఉంటున్నారు. రాష్ట్రంలోని వన్‌స్టాప్ సెంటర్లతో 45 స్వచ్ఛంద సంస్థలను అనుసంధానించాం. యూనిసెఫ్ సహకారం తీసుకుంటున్నాం. బాధిత మహిళలకు సమస్యలను పరిష్కరించేందుకు వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మహిళలు, బాలికలకు పూర్తి రక్షణ, సామాజిక భద్రత, వైద్య, న్యాయసహాయాలు అందించే బాధ్యతను వన్‌స్టాప్ సెంటర్లు సమర్థంగా నిర్వహిస్తున్నాయి. – కృతిక శుక్లా, దిశ ప్రత్యేక అధికారి దిశ బిల్లుకు ఆమోదం.. మహిళలు, యువతులపై దాడులు, అత్యాచారాల కేసుల్లో నిందితులను సత్వరం విచారించి, శిక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ బిల్లును రూపొందించింది. కేవలం 21రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులను గుర్తించి శిక్షించేందుకు అవకాశం కల్పించిన ఈ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. ప్రస్తుతం ఆ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దిశ కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా దిశ కోర్టులను ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏపీ ప్రభుత్వం కోరింది. దిశ కేసుల విచారణ కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది. – వడ్డాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి ఫొటోలు; పి. విజయ్ కృష్ణ, విజయవాడ, జి. రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు -
మృగాళ్లకు మరణ శాసనం
సాక్షి, అమరావతి: బాలికలు, మహిళలను వేధింపులకు గురిచేసే మృగాళ్లకు మరణ శాసనం తప్పదంటూ రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం ఇప్పటికే దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ ల్యాబ్ వంటి అనేక పటిష్టమైన చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే. దిశ బిల్లు అనంతరం మృగాళ్లపై తీసుకుంటున్న కఠిన చర్యలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించడంతోపాటు మహిళలను చైతన్యవంతం చేసేలా అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసింది. అవగాహన కల్పిస్తున్న అంశాలివే.. ► మహిళలు, బాలికల తక్షణ రక్షణ కోసం, వారిపై అకృత్యాలకు పాల్పడిన మృగాళ్లకు శిక్ష పడేలా వేగవంతమైన చర్యల కోసం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మకంగా దిశ బిల్లు–2019 తీసుకొచ్చింది. ► ఇందుకోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, ల్యాబ్‌లు, కోర్డులు వంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ► బాలలు, మహిళలపై అకృత్యాలకు పాల్పడే మృగాళ్లపై కేసు నమోదు చేసి ఏడు రోజుల్లో పోలీస్ దర్యాప్తు, 14 రోజుల్లో న్యాయ విచారణ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. అంటే కేసు నమోదు చేసిన 21 రోజుల్లోనే దోషికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ► మహిళలను మాటలు, చేతల ద్వారా అవమానపర్చటం, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా వేధించడం, సోషల్ మీడియాలో అవమానకరంగా పోస్టులు పెట్టడం, అవాంఛిత సందేశాలు పంపడం, వేధింపులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. ఈ కేసులో మొదటిసారి తప్పుచేసిన మృగాళ్లకు రెండేళ్లు జైలుశిక్ష, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుతోపాటు జరిమానా తప్పదు. ► బాలలపై లైంగిక దాడికి పాల్పడిన మృగాళ్లకు ఐదు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా. ► పోలీసులు, సాయుధ బలగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, జైలు అధికారులు, సంరక్షణాధికారులు, ఆస్పత్రుల యాజమాన్యాలు, సిబ్బంది వంటి వారు ఆయా ప్రాంగణాల్లో బాలలపై అకృత్యాలకు పాల్పడితే తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణిస్తారు. ఇందుకు 14 ఏళ్లకు తక్కువ కాకుండా జీవితకాల కారాగార శిక్షతోపాటు జరిమానా కూడా విధించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అత్యవసర ఫోన్ నంబర్లు అంగన్వాడీ కేంద్రాల్లో బాలలు, మహిళలు అత్యవసర రక్షణ సేవలను పొందేలా ప్రత్యేకంగా ఫోన్ నంబర్లను ప్రదర్శిస్తున్నారు. పోలీస్ సేవలకు డయల్ 100, ఫైర్ సర్వీసెస్ 101, అంబులెన్స్ డయల్ 108, అత్యవసర సేవ 112, ఉమన్ హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ మిత్ర 91212 11100, రోడ్డు ప్రమాదాల్లో అత్యవసర లైన్ డయల్ 1073, టూరిస్ట్ హెల్ప్‌లైన్ 1363 వంటి నంబర్లపై అందరికీ అవగాహన కల్పించి వారు వాటిని నమోదు చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేలా సిద్ధం చేస్తున్నారు. -
దిశ బిల్లు ఆమోదం కోసం.. కేంద్రాన్ని కోరతాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ బిల్లు మహిళా భద్రత దిశగా అతిపెద్ద ముందడుగని ‘మహిళా సాధికారికతపై పార్లమెంటరీ కమిటీ’ ప్రశంసించిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. దిశ బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని కూడా కమిటీ తెలిపిందన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ హీనా విజయ్‌కుమార్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ శనివారం విశాఖపట్నంలో పర్యటించి పోలీసు శాఖలో మహిళా అధికారులు, ఉద్యోగులతో సమావేశమవడంతోపాటు దిశ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిందని తెలిపారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ వ్యవస్థను తీసుకురావడం విప్లవాత్మక సంస్కరణగా పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడిందని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్‌కు అనుసంధానంగా క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వాహనం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయుక్తమైన అంశమని వైద్యురాలితోపాటు న్యాయవాది కూడా అయిన ఆమె ప్రశంసించారని తెలిపారు. దోషులను గుర్తించి 21 రోజుల్లో శిక్ష విధించాలనే నిబంధనలను దిశ బిల్లులో పొందుపరచడంతోపాటు అందుకు అవసరమైన దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శమని చెప్పారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో దిశ వ్యవస్థను తన స్వరాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, పోలీసు అధికారులు పరిశీలించి వెళ్లారని తెలుసుకుని ఆమె సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు వెంటనే చట్టంగా మారేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అందుకోసం కేంద్ర హోం, న్యాయ, మహిళా–శిశు సంక్షేమ మంత్రిత్వశాఖలతో చర్చిస్తామని చెప్పారని తెలిపారు. దిశ బిల్లు, అందులో నిబంధనలు, అంద్జుకు ఏర్పాటు చేసిన మౌలిక వసతుల వ్యవస్థపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు కురిపించడం మహిళా భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. -
మహిళల భద్రత పై రాజీ పడే ప్రసక్తే లేదు: మంత్రి తానేటి వనిత
-
దిశ చట్టం ప్రతులు లోకేష్ చింపడం దారుణం: మంత్రి తానేటి వనిత
సాక్షి, అమరావతి: దిశ చట్టం ప్రతులు నారా లోకేష్ చింపడం దారుణమని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గతంలో ఎప్పుడైనా టీడీపీ ప్రభుత్వం ఇలాంటి చట్టం తీసుకొచ్చిందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో, శాసన మండలిలో దిశ చట్టాన్ని ఆమోదించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అనూషపై యాసిడ్ దాడి జరిగితే పరిహారం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పరిహారం కోసం విమర్శలు చెస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారని, వాళ్ల ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరిగితే ఏనాడు టీడీపీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ రోజు మహిళల కోసం తమపై విమర్శలు చేస్తే ఎవరూ నమ్మరని, దిశ చట్టంతో పాటు మహిళలకు నేరాలు జరగకుండా కాపాడేందుకు దిశ యాప్‌ను తీసుకొచ్చామని వెల్లడించారు. తమ ప్రభుత్వం నమ్మకం కలిగించడం వలన మహిళలు ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. గతంలో మహిళలపై కేసుల విచారణకు 4 నెలలు పట్టేది కానీ ఈ ఏడాది 40 రోజులలోనే విచారణ పూర్తి చేసిన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు మహిళలపై దాడులు జరిగితే వారం రోజుల్లోనే చాలా కేసుల్లో విచారణ పూర్తి చేశామని మంత్రి తానేటి వనిత తెలిపారు. చదవండి: నెల్లూరు: యువతిపై దాడి చేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్ -
చట్టానికి టీడీపీ ఇచ్చే గౌరవం ఇదేనా..?
సాక్షి, అమరావతి: దిశ బిల్లు ప్రతులను కాల్చడం అంటే టీడీపీ నేతలకు, లోకేశ్‌కు చట్టంపై ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని హోం మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. మహిళల భద్రత విషయంలో టీడీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద గురువారం ఆమె వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, రమ్య కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు వాస్తవాలు గమనించి, దిశచట్టంపై పార్లమెంట్లో, కేంద్రపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవాలని సూచించారు. దిశ చట్టం ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందలేదని, అయినప్పటికీ ఆ చట్టంలో నిర్దేశించుకున్న విధంగా 1,600కు పైగా కేసుల్లో వారం రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేశామని ఆమె స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నరసరావుపేట కేసులో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, వారం రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేశారని వివరించారు. 7 నెలల తర్వాత అనూష కుటుంబాన్ని పరామర్శించే పేరుతో లోకేశ్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం తగదని విమర్శించారు. సుగాలి ప్రీతి కుటుంబాన్ని లోకేశ్ పరామర్శిస్తారా? కర్నూలులో 2018లో సుగాలి ప్రీతి హత్య జరిగిందని, అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ కేసును పట్టించుకోలేదని హోం మంత్రి సుచరిత ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ కేసును సీబీఐకి అప్పగించిందన్నారు. మరి ఇప్పుడు లోకేశ్ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారా? అని ఆమె నిలదీశారు. టీడీపీ హయాంలో ఏ కేసులో అయినా వారం రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశారా? అని ప్రశ్నించారు. గుంటూరుకు చెందిన రమ్య కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే రూ.10 లక్షల సహాయం చేశామన్నారు. రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం, ఆ కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల భూమి ఇవ్వాలని, 10 రోజుల్లోనే అవన్నీ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. రమ్య హత్య కేసులో వీలుంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం జగన్‌ను కలిసిన రమ్య కుటుంబ సభ్యులు ఇటీవల హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులు గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జరిగిన ఘటనను సీఎంకు ఈ సందర్భంగా రమ్య తల్లిదండ్రులు జ్యోతి, వెంకటరావు, అక్క మౌనికలు వివరించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున వారి వెంట ఉన్నారు. అనంతరం రమ్య తల్లి నల్లపు జ్యోతి మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబానికి న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం బాగా స్పందించిందని ధన్యవాదాలు తెలిపారు.