
సాక్షి, అమవరావతి: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా మంత్రి తానేటి వనిత సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. న్యాయం, చట్టం వివక్ష లేకుండా అందిస్తున్న ప్రభుత్వంలో.. ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో మూడు ఏళ్లుగా సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఏపీకి జాతీయ అవార్డులు కూడా తీసుకొచ్చారని కొనియాడారు.
‘టెక్నాలజీ వినియోగలోనూ మన పోలీస్ విభాగం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రాబోయే రెండేళ్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాం. మహిళలపై నేరాల నియంత్రణకు కృషి చేస్తాం. దిశ చట్టం కేంద్రంలో పెండింగ్‌లో ఉన్నా అందులోని అంశాలను అమలు చేస్తున్నాం. దిశా యాప్ ద్వారా 900 మందికిపైగా ఆడపిల్లల్లను కాపాడారు. పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, ఫ్రెండ్లీ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అమలును కొనసాగిస్తాం. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేస్తాం. జగనన్న స్ఫూర్తి తోనే పనిచేస్తాం’ అని తెలిపారు.
చదవండి: వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజిని బాధ్యతలు
Comments
Please login to add a commentAdd a comment