
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పథకాలే మహిళలకు శ్రీరామ రక్ష అన్నారు మంత్రి తానేటి వనిత. జగనన్న పరిపాలనలో ప్రతి పథకంలోనూ మహిళలకు పెద్దపీట వేశారని తెలిపారు. ఈ సందర్భంగా తాననేటి వనిత ‘‘మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి నుంచి ఆసరా, చేయూత వరకు.. ఒక్కో మహిళకు రూ.లక్షల్లో లబ్ది జరుగుతోంది. మహిళలు సీఎంలుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని’’ తెలిపారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు తానేటి వనిత. ఆమె మాట్లాడుతూ.. ‘‘డ్వాక్రా మహిళలను చంద్రబాబు ఎందుకు మోసం చేశారు. మహిళ అభివృద్ధి కోసం చంద్రబాబు ఏం చేశారు. టీడీపీ హయాంలో మహిళలపై లెక్కలేనని అఘాయిత్యాలు జరిగినా.. దిశ లాంటి చట్టాన్ని ఎందుకు తేలేకపోయారు. టీడీపీ హయాంలో ఒక్కరికైనా ఇళ్ల స్థలం ఇచ్చారా.. 31 లక్షల మంది మహిళలకు సీఎం జగన్ ఇళ్లు కట్టిస్తున్నారు’’ అని తానేటి వనిత మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment