కొవ్వూరు: టీడీపీ అధినేత చంద్రబాబే పెద్ద దళిత వ్యతిరేకి అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. టీడీపీ హయాంలో దళితులపై ఎన్నో అరాచకాలు, దాడులు జరిగాయని.. కానీ చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పంచాయితీలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కంచికచర్ల ఘటనలో నిందితులను అరెస్టు చేసినా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన శ్యామ్‌కుమార్‌పై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేసి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
విద్యార్థుల గొడవకు రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. గతంలో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ అవహేళన చేశారని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను దళిత జాతి ఎప్పటికీ మరచిపోదన్నారు. చంద్రబాబు పాలనలో దళితులపై ఎన్నో అరాచకాలు, దాడులు, అత్యాచారాలు జరిగాయని.. మహిళా ప్రజాప్రతినిధులపై దాడులకు ఒడిగట్టారని గుర్తు చేశారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దళిత మహిళ కడుపుపై బూటు కాలుతో తన్నారని, అటువంటి నీచ సంస్కృతి టీడీపీదేనని విమర్శించారు. ఇప్పుడు రాజకీయ స్వప్రయోజనాల కోసం దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సీఎం జగన్‌పై బురద జల్లడం వంటి నీచ రాజకీయాలు మానుకోవాలని వనిత హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment