సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసినది తప్పని చంద్రబాబు అంగీకరించారు. కానీ, అంతమాత్రానికే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేయటం తప్పుకాదా?. కోర్టును తప్పుదారి పట్టించటం తప్పుకాదా? అంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు.
కాగా, జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఏ కేసులోనూ అరెస్టు చేయకూడదని చంద్రబాబు అంటున్నారు. నారా వారి రాజ్యాంగాన్ని అమలు చేయాలా?. పోలీసులు, అధికారులు, కోర్టులు అందరినీ బెదిరిస్తారా?. మీకంటూ ఒక సిద్దాంతం లేదా?. అయ్యన్నపాత్రుడు 420 పనిచేస్తే మా బీసీలకు ఏం సంబంధం?. ఒక బీసీగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవచ్చా?. చంద్రబాబు గంటసేపు ప్రెస్‌మీట్ పెట్టి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టటం తప్ప ఏం మాట్లాడారు?.
ఎన్ని వేషాలు వేసినా, జాకీలతో లేపినా టీడీపీ లేవలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో బీసీలంతా బలమైన నాయకులుగా ఎదిగారు. అయ్యన్న తప్పు చేసినందు వల్లే అరెస్టు అయ్యాడు. దానికీ మా బీసీలకు ముడి పెట్టవద్దు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు కూడా మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబుకు అసలు విలువలు, సభ్యత, సంస్కారం ఉందా?. చంద్రబాబు ఎంత రెచ్చగొట్టినా మా బీసీలు ఆయనవెంట నడవరు. బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంతమంది బీసీలకు పదవులు ఇవ్వలేదు. కుప్పంలో కూడా చంద్రబాబు ఓటమి తప్పదు. ఆయన చేయించుకున్న సర్వేలో కూడా అదే తేలింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది?. వారంతా చంద్రబాబు మనుషులే. ఏదైనా చేసి మా మీద బురద చల్లాలని చూస్తున్నారేమో. చంద్రబాబులా కుట్రలు పన్నే అవసరం మాకులేదు. దీనిపై తెలంగాణ పోలీసులు విచారణ జరపాలి’ అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment