March 30th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On March 30th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political Updates March 30th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌, ఎప్పటికప్పటి సమాచారం..

Published Sat, Mar 30 2024 7:20 AM | Last Updated on Sat, Mar 30 2024 10:02 PM

AP Elections 2024: Political News Round Up On March 30th In Telugu - Sakshi

AP Political News And Election News March 30th Telugu Updates 

9:50 PM, March 30th 2024

కాకినాడ:

వాలంటీర్లు ప్రజలకు గొప్పగా  సేవలు అందిస్తున్నారు: కురసాల‌ కన్నబాబు

  • ఈ ఐదేళ్ళ కాలంలో  వాలంటీర్లు లాంటి వ్యవస్ధను పెట్టడానికి వేరే రాష్ట్రం ధైర్యం చేయలేకపోయింది.
  • ప్రజలకు గొప్ప సేవలందించే వాలంటీర్లను నియంత్రించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు.
  • సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై దుర్మర్గమైన కామెంట్లు చేశారు.
  • తాజా గా ఎన్నికల కమీషన్ కు నిమ్మగడ్డ ద్వారా వాలంటీర్లపై పిర్యాదు చేశారు.
  • దీని వల్ల నష్టం ఎవరికీ?
  • రాజకీయంగా వైఎస్ఆర్ సిపిని దీని ద్వారా ఏలా నియంత్రించ గలగుతారు.
  • ప్రజలకు అందే సేవలను నియంత్రించారు.
  • ఐదేళ్ళుగా పెన్షన్లు డోర్ డెలివరీ జరుగుతుంది.
  • మీ తీరు వల్ల పెన్షన్ అందుకునే వృద్దులకు నష్టం జరుగుతుంది.
  • ఈ రెండు నెలలు పెన్షన్లు అందకుండా చేశామని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడు
  • వాలంటీర్లను నియంత్రిస్తే వైఎస్ఆర్ సిపిని నియంత్రించాం అనుకోవడం చంద్రబాబు భ్రమ
  • ప్రజల గుండెల్లో అభిమానం నింపున్న  నాయకుడిగా జగన్ కనిపిస్తున్నారు.
  • వాలంటీర్లను‌ నియంత్రిస్తే జగన్ గారు వీక్ అయిపోతారు అనుకుంటే చంద్రబాబు అమాయకత్వం.
  • చంద్రబాబు తీరు పూర్వం  కత్తి కాంతారావు కత్తి ఫైట్లలా ఉంది

9:25 PM, March 30th 2024

కాకినాడ:

చేబ్రోలులో పవన్ సభ అట్టర్ ప్లాప్

  • పవన్ సభకు జనం కరువు
  • పవన్ మాట్లాడుతుండగానే వెనుదిరిగిన జనం

9:00 PM, March 30th 2024

ప. గో. జిల్లా: 
చంద్రబాబుని మాయల ఫకీరు, జిత్తులమారి నక్కగా అభివర్ణించిన మంత్రి కారుమూరి 

  • నిమ్మగడ్డ రమేష్ చేత ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయించి వాలంటరీల సేవలు నిలిపి వేయించిన నీచుడు చంద్రబాబు 
  • ప్రజలకు మేలు చేసేది ఏదైనా చంద్రబాబుకి ద్వేషమే 
  • ఎవరైనా ఏడుస్తుంటే  చంద్రబాబు ఆనందిస్తాడు  
  • ఎండలు మండుతున్నాయి  . పెన్షన్ ల కోసం అవ్వాతాతలు మళ్ళీ లైన్లో నిలబడి సొమ్మ సిల్లీ  పడిపోతే చంద్రబాబుకి సంతోషం 
  • చంద్రబాబుకి అయన తోక పార్టీకి ఏనాడూ వాలంట్రీలు అంటే ఇష్టం లేదు.
  • చంద్రబాబు సిగ్గు లేకుండా, దుర్మార్గంగా, హేయమైన విధానాలు పాటిస్తూ నిమ్మగడ్డ రమేష్ చేత వాలంట్రీల పై పిర్యాదు చేయించాడు.
  • వాలంట్రీల పై చంద్రబాబు నీచ బుద్ది కపట ప్రేమ ఈ రోజు బయట పడింది
     

8:50 PM, March 30th 2024

విజయవాడ:
పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ అండ్ కో ఫిర్యాదుపై ఎంపీ కేశినేని నాని , ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు ఫైర్ 

  • సీఎం జగన్‌ చెప్పినట్లు పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధమిది 
  • పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయడం చాలా దారుణం 
  • పెన్షన్ల పంపిణీ అంశం పై ఈసీ పునరాలోచించుకోవాలి 
  • పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారు 
  • మొన్నటి వరకూ ఒకటవ తేదీనే పెన్షన్ ఇచ్చేవాళ్లం 
  • ఆ విధానాన్ని కొనసాగించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం 
    -ఎంపీ,కేశినేని నాని

మేధావుల ముసుగులో 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారు

  • నిమ్మగడ్డ రమేష్‌తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా... తొత్తులుగా మారారు
  • చంద్రబాబు డైరెక్షన్  లోనే పెన్షన్లు ఇవ్వొద్దని చెప్పించారు 
  • దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే
    -ఎమ్మెల్యే , మల్లాది విష్ణు

నిమ్మగడ్డ రమేష్ అండ్ బ్యాచ్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు 

  • చంద్రబాబు సమయంలో మూడురోజులు క్యూలో నిలబడితేనే పెన్షన్లు వచ్చేవి కాదు
  • ఈ కుట్రకు కారణం చంద్రబాబే 
  • వృద్ధుల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుంది 
  • సీఎం జగన్‌ ఇంటికే పెన్షన్లు అందిస్తున్నారు 
  • వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్లు ఇస్తున్న ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారు
    -ఎమ్మెల్యే ,వెలంపల్లి శ్రీనివాసరావు

7:40 PM, March 30th 2024

పల్నాడు జిల్లా:

వాలంటర్లీపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమైంది: అంబటి రాంబాబు

  • ఎలక్షన్ కమిషన్ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవతాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడతారు
  • సీఎం జగన్‌పైన కక్షతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాలంటరీ పైన అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు
  • చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయించాడు
  • ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి
  • పెన్షన్లు తీసుకునే వారి పైన కక్షతోనే చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు
  • చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతో వాలంటీర్లను బలి చేయాలనుకుంటున్నాడు
  • కాని బలవుతుంది వాలంటీర్లు కాదు... అవ్వ తాతలు వికలాంగులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు

6:00 PM, March 30th 2024

పాడేరు: 

 మీడియా ముందు కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

  • తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. 
  • టీడీపీ సభ్యత్వం లేని వ్యక్తికి పాడేరు సీటు ఇచ్చారు.
  • రమేష్ నాయుడు డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కున్నాడు..
  • పాడేరు సీటు విషయమై చంద్రబాబు పునరాలోచన చేయాలి.
  • లేదంటే రమేష్ నాయుడుని కంకణం కట్టుకొని  ఓడించి తీరుతాం...
  • గిరిజనలంటే చంద్రబాబుకు ఎందుకు అంత చులకనా...
  • ఏం పాపం చేసాం.. మేం అర్హులం సీటు ఇవ్వడానికి అర్హులం కాదా

5:34 PM, March 30th 2024
నారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

  • నారాయణా! మీకు వేల కోట్ల డబ్బు ఉండొచ్చు
  • అంతకు మించిన అహంకారం నిండా ఆవరించి ఉంది.
  • మీపై పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు
  • అదే మాట మీద ఉండు
  • రెండు వారాలైతే రోజుకు వందసార్లు కలవరిస్తావు ఖలీల్ గారి పేరును
  • ఎన్నికల కౌంటింగ్ రోజున ఇంత భారీ మెజారిటీతో గెలిచాడా అని నోరెళ్లబెడతావు
  • పీడకలలు కంటావు. దళితులు, బిసిలు, మైనారిటీలు, పేదలంటే నీకెంత అసహ్యమో ఖలీల్ ఎవరో తెలియదు అనడాన్ని బట్టి అర్థమవుతోంది. విజ్ఞులైన నెల్లూరు ప్రజలు మీకు గుణపాఠం చెప్పకుండా వదలరు
  • ఈ ఎలక్షన్‌తో మీ రాజకీయ చరిత్ర ముగుస్తుంది
     

5:06 PM, March 30th 2024

విశాఖ:

చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నాడు: గుడివాడ అమర్నాథ్

  • పేదవాడికి - పెత్తందారుడికి మధ్య యుద్ధం జరుగుతుందని  సీఎం జగన్‌ ముందే చెప్పారు
  • అందుకే పేదవారికి టికెట్లు ఇస్తున్నారు
  • టిప్పర్ డ్రైవర్, ఉపాధి హామీ కూలి, సామాన్య కార్యకర్త వీరందరికి సీఎం జగన్ పోటీ చేసే అవకాశం కల్పించారు
  • ఇవన్నీ చూసి చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నాడు
  • చంద్రబాబు పెత్తందారీ పోకడలను ప్రజలకు గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు

3:40 PM, March 30th 2024

కర్నూలు జిల్లా:

డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమజిల్లా ముమ్మడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి భారీగా వైఎస్సార్సీపీలో చేరికలు

  • మేమంతా సిద్ధం బస్సుయాత్రలో తుగ్గలి వద్ద సీఎం శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీలో చేరిన ముమ్మడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్ సానబోయిన మల్లిఖార్జున్‌ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు

3:06 PM, March 30th 2024

నెల్లూరు జిల్లా:

కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి నాకు గురువు తో సమానం: విజయసాయిరెడ్డి

  • మహీధర్ రెడ్డి చేసిన మేలు నా జీవితంలో మరిచిపోలేను
  • కందుకూరు లో పిలిస్తే పలికే దేవుడిగా మహీధర్ రెడ్డి అన్న ను  ప్రజలు కొలుస్తారు
  • కందుకూరు లో మహీధర్ రెడ్డి అన్న పోటీచేయలని కోరుకున్నా
  • కానీ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా బీసీ అభ్యర్థికి కేటాయించారు
  • భవిష్యత్‌లో మహీధర్‌రెడ్డి ఆలోచనల మేరకే కందుకూరులో పరిపాలన ఉంటుంది
  • మానుగుంట మహీధర్‌రెడ్డి  ప్రజా సేవలోనే ఉండాలని కోరుకుంటున్నా
  • మహీధర్ రెడ్డి అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీ గౌరవిస్తుంది

2:57 PM, March 30th 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం : బాలినేని 

  • సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి
  • బాబు అబద్ధాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు
  • మరోసారి బాబుకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధం

2:55 PM, March 30th 2024

ప్లీజ్‌.. నన్ను సపోర్ట్‌ చేయు
గొల్లప్రోలులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో పవన్ సమావేశం

  • నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ 
  • స్థానిక పరిస్థితులు, సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ
  • ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలని కోరిన పవన్‌
  • ఇండిపెండెంట్‌గా దిగితే ఇద్దరూ ఓడిపోతామని హెచ్చరిక

2:30 PM, March 30th 2024

విశాఖ: 

గంటా శ్రీనివాసరావుపై మండిపడ్డ భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కోరాడ రాజబాబు

  • మంత్రిగా అనేక భూ అక్రమాలకు గంటా శ్రీనివాసరావు పాల్పడ్డారు
  • గంటా శ్రీనివాసరావు ఒక అవినీతిపరుడు
  • గంట భూ అక్రమాలకు పాల్పడ్డాడని సైట్ కు ఫిర్యాదులు అందాయి
  •  జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి గంటా
  • బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటాది
  • ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన నేతకు భీమిలిలో సీటు ఎలా ఇస్తారు
  • 4 ఏళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారు
  • డబ్బున్న వారికే చంద్రబాబు టికెట్ల ఇస్తున్నారు
  • టీడీపీలో సీట్లకు వేలంపాట పెడుతున్నారు
  • యువతకి 40 శాతం సీట్లు ఇస్తామన్నారు
  • స్థానిక కాపులకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు

2:20 PM, March 30th 2024

నెల్లూరు జిల్లా:

సీఎం జగన్‌ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటా:  కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి

  • కందుకూరు నియోజకవర్గంలో కులాలకు అతీతంగా పనిచేశా
  • నాకు టికెట్ రాలేదన్నా..బాధ లేదు
  • పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటా
  • వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, కందుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా బుర్రా మధుసూధన్ యాదవ్‌ని భారీ మెజారిటీతో గెలిపిద్దాం
  • కార్యకర్తలు ఎలాంటి అరమరికలు లేకుండా పనిచేసి కందుకూరులో వైస్సార్సీపీ జెండా ఎగరేయాలి

2:10 PM, March 30th 2024
చంద్రబాబుకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్‌..

  • డబ్బున్న వాళ్లకే చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. 
  • వెనుకబడిన వర్గాలవారిని అసెంబ్లీకి పంపాలనే ఆలోచన సీఎం జగన్‌ది. 
  • చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. 
  • ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారు. 

1:40 PM, March 30th 2024
చంద్రబాబు రోడ్‌ షో అట్టర్‌ ప్లాప్‌: ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి 

  • చంద్రబాబు సభపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్.
  • కావలిలో చంద్రబాబు రోడ్ షో అట్టర్ ప్లాప్ అయ్యింది.
  • జనాలు లేక గంటసేపు బస్సులో ఉండి ఆ తర్వాత 2000 మందితో సభ పెట్టుకొన్నారు.
  • చంద్రబాబు హయాంలో కావలికి చేసింది ఏమీ లేదు.. శిలాఫలకాలు తప్ప.
  • రామాయపట్నం, పోర్ట్ ఫిషింగ్ హార్బర్, రోడ్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సీఎం జగన్‌ ఆధ్వర్యంలోనే. 
  • గ్రావెల్ మాఫియాకు నాకు ఎలాంటి సంబంధం లేదు.
  • బోగోలు మండలం బిట్రగుంట వద్ద నేను భూములు ఆక్రమించానని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా.
     

1:19 PM, March 30th 2024
ఏలూరు ఎంపీ సీటుపై కూటమిలో రగడ

  • ఏలూరు పార్లమెంట్‌ సీటుపై బీజేపీలో అసమ్మతి
  • జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కామినేని ఆత్మీయ సమావేశానికి దూరంగా బీజేపీ నేతలు
  • టీడీపీ పుట్టా మహేష్‌ కుమార్‌కి కేటాయించడంపై అభ్యంతరాలు
  • గారాపాటి చౌదరికి టికెట్‌ ఇవ్వాలంటూ విజ్ఞప్తులు
  • ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని గారాపాటిపై అనుచరుల ఒత్తిడి
  • రెండు మూడు రోజుల్లో గారాపాటి ప్రకటన?

1:16 PM, March 30th 2024
వర్మ ఇంట్లో పవన్‌ భోజనం

  • గొల్లప్రోలు చేరుకున్న పవన్‌ కల్యాణ్‌
  • నేరుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి పవన్‌
  • వర్మ ఇంట్లోనే పవన్‌ భోజనం
  • సాయంత్రం చేబ్రోలు రామాలయం వీధిలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ

1:12 PM, March 30th 2024
బండారుకు చంద్రబాబు పిలుపు

  • బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు పిలుపు 
  • పెందుర్తి టికెట్‌ ఆశించి భంగపడ్డ బండారు
  • తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిపాలైన వైనం
  • మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల ఫలితమేనంటూ స్థానికంగా చర్చ
  • బుజ్జగించి చంద్రబాబు ఏ హామీ ఇస్తారో అనే చర్చ
     

1:09 PM, March 30th 2024
ఎచ్చెర్లలో బీజేపీ బీసీ నేతల ఆందోళన

  • శ్రీకాకుళం ఎచ్చెర్లలో నడికుర్తి ఈశ్వర్‌ రావుకు టికెట్‌ ఇవ్వడంపై బీజేపీ బీసీ నేతల అభ్యంతరాలు  
  • కళా వెంకట్రావ్‌ను చీపురుపల్లికి పంపంచి మరీ.. బీజేపీకి టికెట్‌ ఇప్పించిన చంద్రబాబు  
  • బీసీలు అధికంగా ఉన్న చోట.. ఓసీకీ ఇవ్వడంపై బీజేపీ నేతల అభ్యంతరం
  • అభ్యర్థిని మార్చాలంటూ ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు


1:05 PM, March 30th 2024
ఏప్రిల్‌ 1న ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన: రఘువీరారెడ్డి

  • ఏప్రిల్‌ 1వ తేదీన కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్న సీనియర్‌ నేత రఘువీరారెడ్డి
  • 2వ తేదీ నుంచి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు 
  • దేశంలో, ఏపీలో కూడా కాంగ్రెస్‌ గ్యారెంటీలు ఉంటాయి

12:55 PM, March 30th 2024
గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు: వల్లభనేని వంశీ 

  • పేదవర్గాలన్నీ ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు
  • బడుగు, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది
  • ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలకు నమ్మకం ఉంది 
  • ప్రజలతో పాటు నాకు ఈ ప్రభుత్వంపై సంతృప్తి స్థాయి ఎక్కువగా ఉంది  
  • అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం సాయం చేసింది 
  • నేను ఆ ప్రభుత్వంలోనూ పనిచేశా.. ఈ ప్రభుత్వంలోనూ పనిచేశా
  • గత ప్రభుత్వాల్లో ఒకరు చనిపోతేనే మరొకరికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది 
  • ఈ ప్రభుత్వమే ఉత్తమమైనది అని నేను భావిస్తున్నా 
  • నన్ను ఓడిస్తానని నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్లు చెబితే సరిపోదు
  • గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు
  • ఇక్కడున్న ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు గెలుస్తారు 
  • నిత్యం వార్తల్లో ఉండటానికి కొత్తగా వచ్చిన వారు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు 
  • నేను 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 

12:45 PM, March 30th 2024
జనసేసలో వీడని గందరగోళం..

  • జనసేన అభ్యర్థుల ప్రకటనలో వీడని గందరగోళం
  • మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరీ
  • అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అభ్యర్థులను ప్రకటించని పవన్ కళ్యాణ్
  • పాలకొండకి అభ్యర్థి లేక వెతుకుతున్న జనసేన
  • అవనిగడ్డలో అభ్యర్థిని ఇంకా ప్రకటించని జనసేన
  • ఇప్పటికే కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి వదిలేసిన జనసేన
  • విశాఖ సౌత్ సీటుపై సందిగ్ధత
  • విశాఖ సౌత్ సీటు కూడా టీడీపీకి వదిలేస్తారంటూ ప్రచారం
  • విశాఖ సౌత్ సీటు వంశీ కృష్ణకి ఇస్తామని గతంలో పార్టీలో చేర్చుకున్న పవన్
  • విశాఖ సౌత్ అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించని జనసేన
     

12:25 PM, March 30th 2024
మచిలీపట్నం జనసేన అభ్యర్థి బాలశౌరీ

  • మచిలీపట్నం లోక్‌సభ జనసేన అభ్యర్థిగా బాలశౌరీ
  • ఈ మేరకు అధికార ప్రకటన చేసిన పవన్‌ కల్యాణ్‌
  • కాకినాడ జనసేన లోక్‌సభ అభ్యర్థిగా ఉదయ్ 
  • ఇంకా పెండింగ్‌లో మూడు అసెంబ్లీ స్థానాలు

11:50 AM, March 30th 2024
ఎన్నికల తర్వాత టీడీపీకి మనుగడ ఉండదు : విజయసాయిరెడ్డి 

  • చంద్రబాబు అమలు చేయలేని హామీలను ఇస్తున్నారు.
  • టీడీపీ, జనసేన పార్టీలు కలిసిపోతాయి
  • టీడీపీకి సిద్ధాంతాలు, విధివిధానాలు లేవు
  • రాజకీయమే పరమావధిగా టీడీపీ నడుచుకుంటోంది 
  • ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ ఉండదు 
  • ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ, జనసేన కలిసిపోతాయి 
  • చంద్రబాబుకు ఇది ఆఖరి ఎన్నిక 
  • అందుకే అమలు చేయలేని హామీలు ఇస్తున్నారు 
  • ధనవంతులను పార్టీలోకి చేర్చుకుంటూ ధనంతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు 
  • దేశ రాజకీయాల్లో ఇది దురదృష్టకరం

11:30 AM, March 30th 2024
గంటాకు వ్యతిరేకంగా సమావేశం..

  • భీమిలి నియోజకవర్గంలో మాజీమంత్రి గంటాకు వ్యతిరేకంగా సమావేశం.
  • సమావేశాన్ని ఏర్పాటు చేసిన నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ కోరాడ రాజబాబు.
  • హాజరైన టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు.
  • గంటా శ్రీనివాస్‌కు సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులు.
  • పార్టీ కోసం కష్టపడిన కోరాడ రాజబాబుకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం.
  • చంద్రబాబు వైఖరిని తప్పుపట్టిన నేతలు.
  • భీమీలి అసెంబ్లీ సీటు రాజబాబుకి ఇవ్వాలని తీర్మానం.
  • పార్టీ తన నిర్ణయాన్ని పునరాలోచన చేయకపోతే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం.

11:12 AM, March 30th 2024
సీపీఎం అరకు ఎంపీ అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్స

  • లోక్‌సభ ఎన్నికల బరిలో సీపీఎం ఒంటరిపోరు
  • తొలి జాబితా విడుదల చేసిన జాతీయ అధిష్టానం
  • ఆంధ్రప్రదేశ్‌లోని అరకు (ఎస్‌టి)  సీటుకు సీపీఎం పోటీ
  • సీపీఎం అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్స


10:49 AM, March 30th 2024
మైసూర్‌ బోండాకు అంత సీన్‌ లేదు: వెల్లంపల్లి

  • టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమను.. మైసూర్ బోండాంగా అభివర్ణిస్తూ వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా 
  • గతంలో మైసూర్‌ బోండా నియోజకవర్గంలో 32 డివిజన్‌లలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు.
  • బోండా ఉమా కు చిత్తశుద్ధి లేదు.. అందుకే ప్రజల నుంచి మద్దతు లేదు
  • రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా సీఎం జగన్ వైపే ఉన్నారు
  • బోండా ఉమా కుల, మతాల మధ్య విద్వేషాలు రగిల్చే వ్యక్తి
  • రాష్ట్రంలో సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలనందిస్తున్నారు
  • బోండా ఉమా పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడినంత మాత్రాన ఏమి జరిగిపోదు
  • విజయవాడ సెంట్రల్ ప్రజలు బోండా ఉమను తరిమి కొడతారు.


10:29 AM, March 30th 2024
గంటాకు సీటు.. రెబల్‌గా జనసేన అభ్యర్థి పోటీ?

  • భీమిలి సీటు గంటాకు కేటాయించడంపై భగ్గుమన్న జనసేన.. తీవ్ర అసంతృప్తి
  • ఇండిపెండెంట్ గా పంచకర్ల సందీప్ పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి
  • భీమిలిలో చందాలు వేసుకొని జనసేన పార్టీని గెలిపించుకుంటాం
  • 10 సంవత్సరాల కష్టపడిన వారిని పవన్ కల్యాణ్ మోసం చేశారు
  • పవన్ కళ్యాణ్ చేసిన పనికి సిగ్గుతో తలదించుకుంటున్నాం
  • భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి సహకరించేది లేదు
  • పొత్తులో భాగంగా 21 స్థానాలు తీసుకోవడంపై అసంతృప్తి
  • కష్టపడి కాకుండా కొత్తగా పార్టీ లోకి వచ్చినవారికి సీట్లు ఇస్తున్నారు
  • నియోజకవర్గాల మారే గంటా శ్రీనివాసరావు సంగతి మాకు తెలుసంటున్న జనసేన శ్రేణులు

10:17 AM, March 30th 2024
నంద్యాల టీడీపీ సెక్రటరీపై కోడ్‌ ఉల్లంఘన కేసు

  • నంద్యాల జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నేత
  • నంద్యాల టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ పై కేసు నమోదు...
  • నంద్యాల సాయి బాబా నగర్ లోని 24 వ వార్డులు ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా టీడీపీ శంఖారావం కిట్లను పంపిణీ చేసిన టీడీపీ నాయకుడు ఫిరోజ్ పై ఫిర్యాదు
  • స్థానికంగా ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన వీడియో ఆధారంగా ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసిన డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు
  • 188 ఐపిసి సెక్షన్ క్రింద నంద్యాల టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ పై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు...


10:15 AM, March 30th 2024
నాలుగో రోజు ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర

  • కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ మేమంతా సిద్ధం యాత్ర
  • కర్నూలు జిల్లా పత్తిపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • తగ్గలి ప్రజలతో నేడు ముఖాముఖి కార్యక్రమం
  • మధ్యాహ్నాం అనంతపురంలోకి ప్రవేశించనున్న సీఎం జగన్‌ యాత్ర
  • రాత్రికి ధర్మవరం నియోజకవర్గం సంజీవపురంలో బస


10:02 AM, March 30th 2024
విశాఖ YSRCPలోకి భారీగా చేరికలు

  • గాజువాకలో వైఎస్సార్‌సీపీ నూతన కార్యాలయం 
  • పార్టీ కార్యాలయం ప్రారంభించిన రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
  • మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు 
  • జనసేన, టీడీపీ సీనియర్లకు YSRCP కండువా కప్పిన వైవీ సుబ్బారెడ్డి
  • గాజువాకలో అమర్నాథ్‌ను, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపు
  • మళ్లీ జగన్ సీఎం అయ్యేలా ఆశీర్వదించాలని ప్రజల్ని కోరిన సుబ్బారెడ్డి

9:30 AM, March 30th 2024
టీడీపీకి భార్‌ షాక్‌..

  • ఆత్మకూరులో టీడీపీకీ భారీ షాక్..
  • దశాబ్దాలుగా టీడీపీలో ఉంటున్న  అనంతసాగరం మండల అధ్యక్షుడు  రవీంద్ర, మైనార్టీ నాయకుడు ఖాజావలి సహా మరో 200 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరిక
  • జిల్లా పార్టీ కార్యాలయంలో కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్‌ రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ రెడ్డి 
  • నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన విజయ సాయిరెడ్డి. 
  • ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అడ్డా.. మరోసారి పార్టీ జెండా ఎగరడం ఖాయమన్న విక్రమ్‌ రెడ్డి

9:00 AM, March 30th 2024
టీడీపీలో భగ్గుమంటున్న అసంతృప్త జ్వాలలు..

  • కడప జిల్లా రాజంపేట టీడీపీ అసంతృప్తి
  • నిన్న అర్ధరాత్రి తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడు. 
  • టీడీపీలో పనిచేసిన వారికి గుర్తింపు లేదని ఆగ్రహం
  • అనుచరులతో చర్చించిన అనంతరం కీలక నిర్ణయం
  • ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయం 

8:40 AM, March 30th 2024
ఉత్తరాంధ్ర టీడీపీలో ప్రకంపనలు..

  • చివరి జాబితా సీట్లు ప్రకటనపై అసంతృప్తి జ్వాలలు.
  • పాడేరులో టీడీపీ ఫ్లెక్సీలు, ఇదేం ఖర్మ పాంప్లెట్స్ తగలబెట్టిన గిడ్డి ఈశ్వరి అనుచరులు.
  • పాడేరు సీటు రమేష్ నాయుడుకు ఇవ్వడంపై గిడ్డి ఈశ్వరి తీవ్ర అసంతృప్తి. 
  • భీమిలి సీటు గంటాకు ఇవ్వడంపై అసంతృప్తితో రగిలిపోతున్న కోరాడ రాజబాబు.
  • భీమిలిలో గంటాకు సహకరించేది లేదన్న జనసేన నేతలు.
  • చీపురుపల్లి సీటు కళా వెంకట్రావు ఇవ్వడంపై కిమిడి నాగార్జున ఆగ్రహం.
  • పార్టీకి రాజీనామా చేసిన కిమిడి నాగార్జున
  • చంద్రబాబు ఫోటోతో ఉన్న కరపత్రాలు దహనం
  • జనసేనకు నెలుమర్ల సీటు కేటాయించడంపై బంగార్రాజు అసంతృప్తి.
  • చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ టీడీపీకి రాజీనామా చేసిన బంగార్రాజు. 
  • పెందుర్తి సీటు జనసేనకు ఇవ్వడంపై టీడీపీలో అసంతృప్తి.
  • నేడు అనుచరులతో సమావేశమవుతున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి.
     

8:20 AM, March 30th 2024
గిరిజన నేతలను నట్టేట ముంచిన బాబు..

  • నమ్ముకున్న గిరిజన నేతలను నట్టేట ముంచిన చంద్రబాబు.
  • అరకు ఎమ్మెల్యే అభ్యర్థి దున్ను దొరే అంటూ రా కదలిరా సభలో ప్రకటించిన చంద్రబాబు.
  • ప్లేట్ ఫిరాయించి ఆ సీటును బీజేపీకి అప్పగించిన బాబు. 
  • మాజీ ఎమ్మెల్యే దివంగత కిడారి సర్వేశ్వరరావు కుమారుడు మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కు కూడా టికెట్ ఇస్తానని మోసం చేసిన బాబు.
  • పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హ్యాండిచ్చి వేరొకరికి టికెట్ కేటాయించిన టీడీపీ హైకమాండ్‌
  • రంపచోడవరం నియోజకవర్గం నుంచి వంతల రాజేశ్వరిని కూడా వంచించిన టీడీపీ అధినాయకత్వం.
  • చంద్రబాబుపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ గిరిజన నేతలు.
  • బాబు నమ్మించి మోసం చేశాడంటూ నేరుగా చంద్రబాబు ఇంటి వద్ద కొద్దిరోజులు క్రితం నిరసనకు దిగిన వంతల రాజేశ్వరి.
  • ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమైన దొన్ను దొర

8:00 AM, March 30th 2024
టీడీపీ అభ్యర్థికి నోటీసులు..

  • గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖత్‌కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటీసులు
  • ఈనెల 25వ తేదీన సద్దాం హుస్సేన్‌పై చంద్రశేఖర్‌ అనుచిత వ్యాఖ్యలు
  • ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లు చీల్చి ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా కామెంట్స్‌ 
  • ఈ క్రమంలో తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు.
  • దీంతో, చంద్రశేఖర్‌కు నోటీసులు జారీ చేసిన రిటర్నింగ్ అధికారి

7:45 AM, March 30th 2024
అనపర్తి టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి

  • తూర్పు గోదావరిలో అనపర్తి టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  • నల్లమిల్లి అనుచరుల ఆగ్రహం..
  • టీడీపీ జెండాలు, సైకిల్‌ దహనం
  • అనుచరుల సమావేశంలో కుటుంబ సభ్యులతో కలిసి కంటతడి పెట్టిన నల్లమిల్లి
  • బుజ్జిగించేందుకు యత్నించిన అధినేత చంద్రబాబుతో ఫోన్‌లోనూ అసహనం ప్రదర్శించిన నల్లమిల్లి
  • ఇవాళ రెండోరోజు ప్రజల ముందుకు నల్లమిల్లి
  • బిక్కవోలులో నల్లమిల్లి కుటుంబ సభ్యుల పర్యటన
  • నల్లమిల్లి తన సింపథీ డ్రామాలు ఆపి.. చంద్రబాబునే నిలదీయాలంటున్న వైఎస్సార్‌సీపీ

7:35 AM, March 30th 2024
అనంత టీడీపీలో అసమ్మతి జ్వాలలు

  • టిక్కెట్ల కేటాయింపులో సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి
  • అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి దక్కని టిక్కెట్
  • అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు
  • చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టిన టీడీపీ నేతలు
  • అనంతపురం ఎంపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి
  • తన కుమారుడు జేసీ పవన్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ వస్తుందని ఆశించిన జేసీ
  • మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్‌నకు గుంతకల్లు టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు
  • గుంతకల్లు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్
  • గుమ్మనూరు జయరామ్‌నకు టిక్కెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ గుంతకల్లులో టీడీపీ నేతల నిరసన
  • చంద్రబాబు, నారా లోకేష్ ఫ్లెక్సీలు చించేసి దహనం చేసిన టీడీపీ నేతలు

7:30 AM, March 30th 2024
మేమంతా సిద్ధం@డే-4

  • నేడు కర్నూలు, అనంత జిల్లాల్లో సీఎం జగన్‌ బస్సు యాత్ర 
  • శనివారం(మార్చి 30) ఉదయం పత్తికొండ బస నుంచి ప్రారంభం కానున్న మేమంతా సిద్ధం యాత్ర
  • రాతన, తుగ్గలి, జోన్నగిరి మీదుగా సాగనున ఎన్నికల ప్రచార యాత్ర
  • కర్నూలు జిల్లా తుగ్గలిలో ప్రజలతో ముఖాముఖి కానున్న సీఎం జగన్
  • ఈరోజు మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్న సీఎం జగన్ బస్సు యాత్ర
  • జొన్నగిరి మీదుగా గుత్తిలోకి  ప్రవేశించనున్న ప్రచార రథం
  • గుత్తి శివారులో భోజన విరామం
  • గుత్తి, పామిడి, గార్లదిన్నె, అనంతపురం, రాప్తాడు మీదుగా సాగనున్న సీఎం జగన్ రోడ్ షో 
  • ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం శివారులో రాత్రి బస

7:25 AM, March 30th 2024

నేడు మూడు జిల్లాలో చంద్రబాబు పర్యటన 

  • నెల్లూరు, తిరుపతి, కడపలో ప్రతిపక్ష నేత ఎన్నికల ప్రచారం
  • సూళ్లురుపేట, నాయుడుపేట, ప్రొద్దుటూరులో టీడీపీ బహిరంగ సభలు
  • ప్రజా గళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు

7:20 AM, March 30th 2024
పిఠాపురం ప్రచారం.. నేడు వర్మ ఇంటికి పవన్‌

  • నేటి నుంచి పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం
  • పిఠాపురంలో నాలుగు రోజుల పాటు ప్రచారం
  • శక్తిపీఠం అమ్మవారి ఆలయంలో వారాహి వాహనానికి పూజలు
  • దొంతమూరులోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి పవన్‌
  • వర్మ ఇంట్లో కేడర్‌, వివిధ వర్గాలతో సమావేశం
  • సాయంత్రం బహిరంగ సభ

7:15 AM, March 30th 2024
ప్రచారంలోకి ఏపీ మాజీ సీఎం

  • నేడు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి
  • రాజంపేట పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ
  • శనివారం మదనపల్లెలో రోడ్‌షోలో పాల్గొననున్న నల్లారి కిరణ్‌

7:10 AM, March 30th 2024
పసుపు పార్టీ ఉక్కిరిబిక్కిరి

  • టీడీపీ తుదిజాబితాపై కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు 
  • అనంతపురంలో పార్టీ కార్యాలయానికి నిప్పు 
  • గుంతకల్లు కార్యాలయంలో ఫర్నిచర్‌ ధ్వంసం 
  • చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టిన కార్యకర్తలు 
  • గుమ్మనూరు జయరాం టికెట్‌పై చెలరేగిన నిరసనలు   
  • సత్యవేడులో ఆదిమూలం మాకొద్దంటూ ర్యాలీ 
  • చీపురుపల్లి టీడీపీలో ‘కళ’కలం 
  • అనపర్తిపై ఫలించని ‘దేశం’ రాయబారం 
  • తంబళ్లపల్లెలో ఆవిర్భావ దినోత్సవానికి వర్గపోరు 
  • రాజంపేటలో ఎగిసిపడిన అసంతృప్తి జ్వాలలు 
  • బద్వేలు టీడీపీ అభ్యర్థికే బీజేపీ సీటంటూ ఆగ్రహం   
  • ‘గంటా’కు రూ. కోట్లున్నాయని టికెట్‌ ఇచ్చారంటూ ధ్వజం 

7:00 AM, March 30th 2024
టీడీపీ అభ్యర్థి కొలికిపూడికి షాక్‌..

  • తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్‌కు షాకిచ్చిన మహిళలు
  • గంపలగూడెం మండలం దుందిరాల పాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొలికపూడి 
  • సైకిల్‌కు ఓటేయాలని కోరిన కొలికపూడి 
  • తమకు సైకిల్ వద్దు.. ఫ్యానే కావాలన్న మహిళలు 
  • సైకిల్ రాదు.. ఫ్యాన్‌కే ఓటేస్తామన్న మహిళలు 
  • మహిళలు తిరగబడటంతో అక్కడ్నుంచి జారుకున్న కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు

6:50 AM, March 30th 2024
ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్‌

  • నా కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉంది
  • ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో  నిలిచిపోతుంది
  • వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోంది
  • మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపినట్లుంది
  • జెండాలు జత కట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి.. మీ వాడిని, మీ బిడ్డని ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం ఇక్కడకి రావడం నా పూర్వ జన్మ సుకృతం
  • మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది
  • పెత్తందార్లను ఓడించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?\
  • నేను మీ సోదరుడిగా అడుగుతున్నాను.. రాఖీ కట్టమని  ప్రతీ అక్క చెల్లెమ్మను కోరుతున్నాను..
  • ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని అడుగుతున్నా
  • ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్‌ కట్టమని అక్కా చెల్లెమ్మలను అడుగుతున్నాను
  • నా చేతికి మాత్రమే కాదు.. ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రాఖీ కట్టమని కోరుతున్నాను
  • అక్క చెల్లెమ్మల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరుతో రిజిస్టేషన్‌ చేయడమే కాకుండా, అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న ప్రభుత్వానికి రాఖీ కట్టమని అడుగుతున్నాను.
  • ఎప్పుడూ చూడని విధంగా మహిళల కోసం దిశ యాప్‌ తీసుకొచ్చిన ప్రభుత్వానికి రక్షా బంధన్‌ కట్టమని కోరుతా ఉన్నా
  • మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్‌ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్‌ కట్టమని కోరుతా ఉన్నా

6:40 AM, March 30th 2024
కళ్యాణదుర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ

  • టీడీపీకి రాజీనామా యోచనలో కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు
  • ఉమామహేశ్వర నాయుడును కలిసిన కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి
  • టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన నేతలు

6:30 AM, March 30th 2024
టీడీపీ, జనసేనలకు షాక్‌.. 

  • ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమిని వీడుతున్న ముఖ్య నేతలు 
  • తాడేపల్లిగూడెంలో ఈలి నాని టీడీపీకి గుడ్‌బై 
  • ఆయన దారిలోనే నూజివీడు మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య 
  • ఇటీవలే టీడీపీని వీడిన ఎన్‌ఆర్‌ఐ గోపాల్‌ యాదవ్‌ 
  • చేగొండి సూర్యప్రకాశ్, నౌడు వెంకటరమణలు జనసేనకు రాం రాం.. తాజాగా జనసేనకు రాజీనామా చేసిన ముమ్మిడివరం నేత పితాని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement