‘సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ చీట్స్‌గా మారిపోయింది’ | YSRCP Leader RK Roja On AP Assembly Budget Session 2024-25 | Sakshi
Sakshi News home page

‘సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ చీట్స్‌గా మారిపోయింది’

Published Mon, Nov 11 2024 5:20 PM | Last Updated on Mon, Nov 11 2024 6:10 PM

YSRCP Leader RK Roja On AP Assembly Budget Session 2024-25
  • తొలి బడ్జెట్‌లోనే చంద్రబాబు మోసం బయటపడింది
  • చంద్రబాబు మరోసారి మహిళలను మోసం చేశారు
  • మాజీ మంత్రి ఆర్‌కే రోజా ధ్వజం

అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం బయటపడిందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. ఎన్నికల్లో చెప్పిన సూపర్‌ సిక్స్‌ సూపర్‌ చీట్స్‌గా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు రోజా.  ఈ మేరకు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రోజా ‘ఎక్స్‌’ వేదికగా ధ్వజమెత్తారు.

‘చంద్రబాబు మరోసారి మహిళలను మోసం చేశారు. తొలి బడ్జెట్‌లోనే చంద్రబాబు మోసం బయటపడింది. 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున  ఏడాదికి 18,000 ఇస్తాం అని.. బడ్జెట్‌లో నిధులు ఇవ్వకపోవడం మోసం కాదా..?, ఎన్నికల్లో గెలవగానే ప్రతి నిరుద్యోగ యువతి, యువకులకు నెలకి 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం అని ఒక్క రూపాయి కేటాయించకపోవడం దగా కాదా..?, ఎన్నికల్లో గెలవగానే మహిళలకి ఉచిత బస్ పథకం అమలు చేస్తామన్నారు.. ఇప్పుడు ఆ పథకానికి నిధులే ఇవ్వలేదు..! మోసం కాదా..?, తల్లికి వందనం పథకానికి నిధులు సగానికిపైగా కోత పెట్టడం..దగా కాదా..?

ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అని....ఈ ఏడాది 2 సిలిండర్లను ఎగనామం పెట్టడం..మోసం కాదా..?,50 ఏళ్లకే మహిళలకు పెన్షన్ ఇస్తాం అన్నారు.. ఏది ఈ బడ్జెట్ లో ఆ ప్రస్తావన?, రైతులకు రూ. 20 వేలు ఏడాది పెట్టుబడి సహాయం ఇస్తాం అన్నారు... 10 వేల కోట్లు ఇవ్వాల్సింది 4,500  కోట్లే ఇవ్వడం రైతులను మోసం చేయడం కాదా...?, ఎన్నికల్లో ఓట్లెయించుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం @PawanKalyan ఇంటింటికి  మీరిచ్చిన బాబు ష్యురిటీ.. భవిష్యత్‌కి  గ్యారంటీ..బాండ్ల ను ఇప్పుడు ఏం చేసుకోవాలి.. ఆ చెల్లని బాండ్లపై ఇప్పుడు ప్రజలు చీటింగ్ కేసులు పెట్టాలా..?, సమాధానం చెప్పాలి!! అ​ంటూ ఆర్‌కే రోజా ప్రశ్నల వర్షం కురిపించారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement