
కూటమి సర్కార్ తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.
సాక్షి, చిత్తూరు జిల్లా: కూటమి సర్కార్ తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల దుష్ప్రచారం బట్టబయలైందంటూ ఆమె ట్వీట్ చేశారు. మిస్సింగ్ కేసుల్లో 99.5 శాతానికిపైగా మహిళలను గత ప్రభుత్వంలోనే గుర్తించారని కేంద్ర హోంశాఖ కూడా పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. అధికారం కోసం ఎంతటి అబద్ధమైనా చెప్తారా?’’ అంటూ ఆర్కే రోజా నిలదీశారు.
అసెంబ్లీ సాక్షిగా ఇన్నాళ్లు @JaiTDP, @JanaSenaParty చేసిన తప్పుడు ప్రచారం బట్టబయలైంది.
గత @YSRCParty ప్రభుత్వం లో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం.
ఐదేళ్ళలో 34 కేసులు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి… pic.twitter.com/vTBGvDWsKN— Roja Selvamani (@RojaSelvamaniRK) November 16, 2024