సీఎం జగన్‌పై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

ప్రజాగళం సభలో సీఎం జగన్‌పై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

Published Mon, Apr 29 2024 4:06 AM

Chandrababu Controversial comments On CM YS Jagan

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం సభలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

బహిరంగంగానే బరితెగించిన టీడీపీ అధినేత.. సీఎం జగన్‌పై కుతంత్రం!

జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించే కుట్ర

కొద్దిరోజుల క్రితం ‘ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకుని కొట్టండి’ అంటూ వ్యాఖ్య.. ఆ తర్వాతే విజయవాడలో సీఎంపై హత్యాయత్నం

మరో సభలో.. గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ కేడర్‌కు సైగలు

తాజాగా.. జగన్‌ నిన్ను చంపితే ఏమవుతుందంటూ బహిరంగ ప్రసంగం

గతంలో ‘గాలిలో వస్తాడు..గాలిలోనే పోతాడు’ అంటూ కూడా వ్యాఖ్య

ఓటమి భయంతో ఇష్టానుసారం బాబు బరితెగింపు మాటలు

మరోవైపు.. తన పాలన నచ్చితే ఓటేయమని అభ్యర్థిస్తున్న జగన్‌

జగన్‌కు ప్రాణహాని ఉందని ఈసీకి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌సీపీ ఏర్పాట్లు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యంలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు కళ్ల ముందే ఓటమి స్పష్టంగా కనిపించడంతో చేసేదిలేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో బహిరంగ సభల్లో ఇష్టమొచ్చి­నట్లు నోరు పారేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్త­మవుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజక­వర్గం బుచ్చిరెడ్డిపాళెం సభలో.. ‘జగన్‌మోహన్‌రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది’.. అంటూ ఆయన బరితెగించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను ఆయన ఎటువైపు తీసుకెళ్తు­న్నారనే ఆందోళన సాధారణ ప్రజలు, మేథావులు, తటస్థులు వ్యక్తంచేస్తున్నారు. 

జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారే­మోనని అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే తాడికొండలో జరిగిన సభలో ‘ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి’.. అంటూ సీఎంపై దాడికి పురి­కొల్పేలా మాట్లాడారు. ఆ తర్వాతే విజయవాడ సింగ్‌నగర్‌లో బస్సుయాత్ర చేస్తున్న జగన్‌పై హత్యా­యత్నం జరిగింది. 

ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంభోదించడం, రాయిపెట్టి కొట్టాలనడం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. మరో సభలో.. గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఆయన సైగల ద్వారా చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వె­ర­పోయారు. ఇప్పుడు ఏకంగా జగన్‌ను నేరుగా ఉద్దే­శిస్తూ నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడ­డంతో చంద్రబాబు మనసులో దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

ఆయన ఆ మాట అన్నా­రంటే జగన్‌పై ఎంత కసి, కక్ష ఉన్నాయో తెలుస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ముఖ్య­మంత్రిని చంపేయాలని ప్రతిపక్ష నేత మాట్లాడడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయంలోనూ వైఎస్‌ జగన్‌ను దీటుగా ఎదుర్కో­లేని పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతు­న్నట్లు స్పష్టమవుతోంది. 

సీఎంని పదేపదే వ్యక్తిగతంగా దూషించడం, దాడులకు ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తుండడం, చివరికి ఇంకా దిగ­జారి చంపమని చెప్పడం బాబు మానసిక దౌర్భ­ల్యాన్ని సూచిస్తోందంటున్నారు. ఆయన ప్రతి సభ­లోనూ, ప్రతి సమావేశంలోనూ జగన్‌పై విద్వేషం వెళ్లగక్కు­తూనే ఉన్నారు. సీఎంను సైకో అంటూ దిగజా­రుడుగా సంభోదిస్తూ తన అక్కసు, కడుపుమంట చల్లార్చుకుంటున్నారు.

బాబు తీరుతో టీడీపీ కేడర్‌లో ఆందోళన..
అలాగే.. జగన్‌ తన పాలనలో మంచి జరిగిందను­కుంటేనే తనకు ఓటేయాలని కోరుతుంటే బాబు మాత్రం ‘చంపండి.. పొడవండి.. రాళ్లు విస­రండి.. గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు’.. అంటూ మాట్లా­డడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక­పోతు­న్నారు. వైఎస్‌ జగన్‌ తన పాలనలో తాను చేసిన పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి చక్కగా చెబుతున్నారని, చంద్రబాబు వైఫల్యాలు ఆయన గతంలో విడుదల చేసిన మేనిఫెస్టోను చూపించి దాన్ని అమలుచేయలేదని చెబుతున్నారని వీటిపై మాట్లాడకుండా అదే పనిగా తిట్టడంవల్ల ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. 

జగన్‌ తన మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పోల్చిచూపడం, అందులోని అంశాలను వివరించి చెప్పే విధానం ప్రజల్లోకి బాగా వెళ్తోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలుచేయలేదనే విష­యాన్ని చాలా సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, దీనికి కౌంటర్‌ ఇచ్చే పరిస్థితి తమ పార్టీకి లేకుండాపోయిందనే వాపోతున్నారు.

టీడీపీని రద్దు చేయాలి: ఎమ్మెల్యే ప్రసన్న
బుచ్చిరెడ్డిపాళెంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోవూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. చంద్రబాబు తన పాలనా దక్షత కన్నా.. కుట్రలు, కుతంత్రాలు, హత్యలను నమ్ము­కుని రాజకీయం చేస్తున్నారంటూ మండిప­డ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ సుమో­టోగా తీసుకుని చంద్రబాబుపై కేసు నమోదు చేసి, టీడీపీని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు ఫైల్‌ చేయాలని కోరారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రాణాలకు హాని ఉందని చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు.

వేమిరెడ్డీ.. బాబు వ్యాఖ్యలను సమర్థిస్తున్నావా?
బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమ­యంలో ఎంపీ, ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న వేమి­రెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దంపతులు పక్కనే ఉన్నప్పటికీ వారు వారించకుండా మౌనంగా ఉండిపోవడంపై నెల్లూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నైతిక విలువ­లుంటే ఇలా­ంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహి­స్తున్న బాబు పార్టీ నుంచి తప్పుకోవాలని, లేదంటే బహి­రంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తు­న్నా­రు.

దారుణంగా పడిపోయిన చంద్రబాబు ఇమేజ్‌
సీఎం జగన్‌ హుందాగా మాట్లాడుతుంటే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత నీచస్థాయికి దిగజారి మాట్లాడుతుండడం సాధారణ ప్రజా­నీకంలోనూ చర్చనీయాంశమైంది. ఇప్ప­టికే ప్రజల్లో, జాతీయ స్థాయి రాజకీయ పక్షాల దృష్టిలో నమ్మదగని నేతగా ముద్ర­పడిన చంద్రబాబు ఇమేజ్‌ దారుణంగా పడి­పోయింది. 

ప్రజలే కాదు.. ఏ రాజకీయ పక్షం ఆయన్ను నమ్మే పరిస్థితిలేదు. ప్రస్తుతం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా ఆయన్ను బీజేపీ పెద్దలు నమ్మ­డంలేదని టీడీపీ నేతలు వాపో­తున్నారు. చంద్రబాబు నిలకడలేని స్వభా­వం, అవకాశ­వాద వైఖరి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ద్వారా తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ వైఖరే ఆయన్ను ప్రజల్లో మోసగాడిగా నిలబెట్టింది.

ఓటమి భయంతోనే ఇలా..
బాబు తన పాలన, తన విధానాల గురించి కాకుండా కేవలం ఎదురుదాడి చేయడం, దూషించడంవల్ల ఉపయోగం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఆయన ప్రసంగాలు ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉండడంలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హద్దులు దాటిపోయి చేస్తున్న ఆరోపణలు, దూషణలు చంద్రబాబులో ఉన్న అసహనం, భయాన్ని చూపుతున్నాయని, ఓటమి భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని తట­స్థులు సైతం చెబుతున్నారు. 

తాను చేసిందేమీ­లేక చెప్పుకోలేకపోవడం, ఏం చేస్తానో చెప్పలేక­పోవడం, ఆయన చెప్పే ఇతర విషయాలను జనం పట్టించుకోకపోవడంతో జీవిత చరమాంకంలో ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నట్లు చెబు­­తున్నారు. అదే సమయంలో ఆయన విద్వే­ష­పూరిత ప్రసంగాలవల్ల రాష్ట్రంలో శాంతిభద్ర­తల సమస్య నెలకొనే పరిస్థితి ఏర్పడుతోంది. 

Advertisement
Advertisement