కూటమి ఉమ్మడి సభకు లోకేష్ డుమ్మా
ఇటీవల జరిగిన రెండు కీలక రాజకీయ సమావేశాలకు టీడీపీ యువనేత లోకేష్ డుమ్మా కొట్టాడు పార్టీకి, కూటమిని సంబంధించిన కీలక సభలు, సమావేశాలకు లోకేష్ రాకపోవడం పార్టీలో చర్చకు దారితీసింది. మొన్న జరిగిన ఇరుపార్టీల సీట్ల పంపకం సభకు కూడా లోకేష్ రాలేదు... నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన కూటమి సభకు సైతం లోకేష్ రాలేదు..? ఎందుకని ఏమి జరిగింది.. గతంలో భోగాపురంలో జరిగిన లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వచ్చారు కానీ నేడు తాడేపల్లిగూడెం సభకు లోకేష్ ఎందుకు రాలేదు..? ఏమైనా బిజీగా ఉన్నారా ? ఎంత బిజీగా ఉంటేమాత్రం ఈ కార్యక్రమానికన్నా ముఖ్యమైనది ఏముంది... కానీ లోకేష్ రాకపోవడం మాత్రం అక్కడ చర్చకు దారితీసింది.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు కాస్త ప్రాధాన్యం ఇవ్వడాన్ని లోకేష్ అంగీకరించడం లేదని, అసలు పవన్ తో పొత్తే లోకేష్ కు ఇష్టం లేదని, అంటున్నారు. పవన్ కు కాస్త సినిమా క్రేజ్ ఉండడం.. అయన సభలకు జనం రావడం.. అయన కోసం చంద్రబాబు వెళ్లి కలవడం వంటివి తనకు అవమానంగా భావించిన లోకేష్ సాధ్యమైనంతవరకు పవన్ తో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొన్నామధ్య టీవీఛానెల్ ఇంటర్వ్యలో కూడా లోకేష్ మాట్లాడుతూ పవన్ను పూచికపుల్ల మాదిరి తీసి పారేసారు. అధికారంలో పావనుకు వాటా ఇస్తారా అని ప్రశ్నించగా అస్సలు అలాంటి ప్రసక్తే లేదని, మొత్తం ఐదేళ్లూ చంద్రబాబే సీఎంగా ఉంటారని, అసలు పవన్ ను ఆ దృష్టితో చూడడం లేదన్నట్లు చెబుతూ ఆయన్ను చాలా లైట్ అన్నట్లుగా మాట్లాడారు.
ఇది జనసైనికుల్లో కాస్త ఆగ్రహాన్ని రేకెత్తించిన అయన మాత్రం తగ్గలేదు.. ఆంటే లోకేష్ దృష్టిలో పవన్ ఒక రాజకీయ నాయకుడు కాదు...కేవలం సినిమా హీరో మాత్రమే కాబట్టి ఆయన్ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదనేది అయన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.. దీనికితోడు ఆ సభలో పవన్ కు క్రేజ్ ఉంటుంది.. క్యాడర్.. జనాలు కూడా పవన్ను చూసి కేకలు, అరుపులు ఉంటాయి తప్ప అక్కడ లోకేష్ ను ఎవరూ పట్టించుకోరు... అది కూడా లోకేష్ ఆబ్సెంట్ కు ఒక కారణం అని చెబుతున్నారు. పవన్ తో పొత్తులేకుండా సింగిల్ గా ఎన్నికలకు వెళ్లాలన్నది లోకేష్ ఆలోచన అయితే దీన్ని చంద్రబాబు కాదని జనసేనలో పొత్తు పెట్టుకున్నారని, ఈ అంశం కుటుంబంలో గొడవకు దారితీసిందని కూడా అంటున్నారు. ఏదైతేనేం మొత్తానికి లోకేష్ రెండు కీలక ఘట్టాల్లో కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది .
సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment