లోకేష్‌కు కోపం వచ్చింది.. అదేంటి లోకేష్ అంటే మెతక.. మెత్తగా ఉంటాడు.. ఆయనకు కోపం రావడం ఏందీ ? ఎవరిమీద వస్తుంది అని అనుకుంటున్నారా ? నిజమేనండి. ఆయనకు కోపం వచ్చింది. ఏకంగా చంద్రబాబు మీదనే నిప్పులు చెరిగారు. దానికి అయన భార్య బ్రహ్మణి సైతం వత్తాసుపలికారు. దీంతో కుటుంబంలో హాట్‌హాట్‌గా వాదనలు జరిగాయట. చివరకు లోకేష్ అలిగి తన భార్యతో కలిసి ఫామ్ హౌజ్‌కి వెళ్లిపోయారని తెలిసింది. అయితే ఇదంతా బయటకు రాకుండా మ్యానేజ్ చేశారని అంటున్నారు.
వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ అయ్యాక పార్టీని నడిపించేవాళ్లు కరువయ్యారు. అటు లోకేష్ సైతం పాదయాత్రను ఆపేసి ఢిల్లీ వెళ్లారు. న్యాయవాదులతో చర్చలు.. కోర్టులు బెయిల్ పిటిషన్లు అంటూ కొన్నాళ్లు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. దీంతో పార్టీ కాస్తా పూర్తిగా డీలాపడిపోయింది. ఈ తరుణంలో జైలుకు పరామర్శకు వచ్చిన పవన్ కల్యాణ్ ఏకంగా టీడీపీతో కలిసి పొత్తులో ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఆ తరువాత పవన్ పలుమార్లు తన పొత్తుల గురించి సమర్ధించుకుంటూ వస్తున్నారు. దీంతోపాటు కాపులను ఏమార్చి వారిని దగ్గరకు తీసుకునేందుకు చంద్రబాబు ఎత్తులు వేసి, అందులో భాగంగా పవన్కు మరింత గౌరవం.. మరింత ప్యాకేజి.. మరింత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావించారు. అంతేకాకుండా ఈనెల 22న జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభకు సైతం పవన్ వచ్చేలా ఒప్పించారు.
నేనెందుకు జై పవన్ అనాలి
అయితే ఈ ప్రతిపాదన లోకేష్‌కు కోపం తెప్పించిందని తెలుస్తోంది. పాదయాత్ర చేసింది తాను అయితే చివర్లో పవన్ వచ్చి హైప్ మొత్తం ఆయన తీసుకుంటాడని లోకేష్ భయపడినట్లు తెలుస్తోంది. పవన్ వస్తే ఇక యూత్, కుర్రాళ్లు అంతా పవన్ వైపు చూస్తారని, తనను ఎవరూ పట్టించుకోరని ఆందోళన వ్యక్తం చేశారట. అంతేకాకుండా సభలో చివర్లో జై పవన్ అని కూడా అనాల్సిందే అని చంద్రబాబు పెట్టిన కండిషన్ చూసి లోకేష్‌కు కోపం వచ్చిందట. భార్య సైతం లోకేష్‌కు వత్తాసు పలకడంతో చంద్రబాబుకు లోకేష్, బ్రహ్మణితో వాదోపవాదాలు జరిగాయని అంటున్నారు. చంద్రబాబు పవన్‌కు అత్యంత అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని లోకేష్ ఆయన భార్య అంగీకరించడం లేదని. ఇది కాస్త కుటుంబంలో తగాదాకు దారి తీసిందని అంటున్నారు.
అంతేకాకుండా తనకు ప్రాధాన్యం ఇవ్వాలని, పవన్ కల్యాణ్ పెద్దగా పట్టించుకోవద్దని డిమాండ్ చేశారని తెలిసింది. ఆ తరువాత భార్యను తీసుకుని లోకేష్ ఫామ్ యాత్రకు వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో చంద్రబాబు కాస్త ఆందోళనకు గురై మళ్లీ లోకేష్‌ను ఒప్పించి తీసుకొచ్చారని తెలిసింది. ఇక ముందు పవన్ కన్నా లోకేష్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా తండ్రీకొడుకుల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలిసింది. ఆ కండిషన్లు అన్నీ చంద్రబాబు ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితిని లోకేష్ తీసుకొచ్చారని అంటున్నారు. అవన్నీ ఒప్పందాలు కుదిరిన తరువాతనే లోకేష్ మళ్లీ వచ్చి పాదయాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.
::: సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment