Live Updates
AP Assembly: మండలిలో వైఎస్సార్‌సీపీ ఆందోళన
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ రేపటికి(బుధవారం) వాయిదా పడింది.
హోంమంత్రి అనిత నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి హోం మంత్రి మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలే
ఇంతకుముందే విశాఖలో లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది
మొన్న పెద్ద గంట్యాడలో అమ్మాయిని కొడితే చర్యలు లేవు
చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం చేస్తే అరెస్టులు లేవు
అందువల్లే ఇప్పుడు భయం లేకుండా లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది
గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన దిశా చట్టాన్ని ఇప్పుడు నిర్వీర్యం చేశారు కాబట్టే ఈ పరిస్థితులు
ఇసుక, మద్యం గురించి చర్చిస్తారు గాని మహిళల రక్షణపై ఎందుకు చర్చలు జరపట్లేదు
ఈరోజు తల్లిదండ్రులు వారి పిల్లల్ని చదివించడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది
ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
గతంలో కొంతమందిని రెగ్యులరైజ్ చేశాం
ఎన్నికల కోడ్ దృష్ట్యా కొన్ని ఆగిపోయాయి
మిగిలిన వారిని ఈ ప్రభుత్వ రెగ్యులరైజ్ చేయాలి
కూటమి ప్రభుత్వం వచ్చాక 104, 108, అంగన్వాడి ఆశా వర్కర్ల పరిస్థితి దయనీయంగా మారింది
వాళ్ల న్యాయబద్ధమైన డిమాండ్స్ ప్రభుత్వం తీర్చాలి
104, 108 ను వైఎస్సార్ తీసుకువస్తే గత సీఎం జగన్ వాటికి తగినన్న నిధులు కేటాయించి ఎంతో వృద్ధిలోకి తెచ్చారు
ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు 104, 108 లు పది నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఎంతోమందిని ప్రాణాపాయ పరిస్థితి నుండి కాపాడాయి
అంగన్వాడి, ఆశా వర్కర్ల పిఎఫ్, గ్రాట్యూటీ, సర్వీసుల్లో చనిపోతే దహన సంస్కారాలకు 20,000 ఆర్థిక సాయం చేయడం వంటి కార్యక్రమాలు అమలు చేయాలి.
మండలిలో మాట్లాడాలని భావించిన అవకాశం ఇవ్వలేదు
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: వరుదు కల్యాణి
ఈ ప్రభుత్వంలో ఉద్యోగులందరు ఇబ్బందులు పడుతున్నారు
108, 104, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు
ఈ ఉద్యోగుల సమస్యలన్నింటిని పరిష్కరించాలి
ఈ ఉద్యోగుల సమస్యల పై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
నిన్న హోంమంత్రి అనిత మహిళలపై నేరాల పై అబద్ధాలు చెప్పారు
సాక్షాత్తు హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోనే మహిళలపై నేరాలు జరుగుతున్నాయి
ఈ రోజు విశాఱలో లా విద్యార్థి పై గ్యాంగ్ రేప్ జరిగింది
నిన్న బాపట్లలో బాలిక పై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు
హోంమంత్రి ఉన్న విశాఖ లో కొద్దీ రోజుల కిందట హత్యాయత్నం చేశారు
ఈరోజుకి హత్యాయత్నం చేసిన నిందితుడిని పట్టుకోలేదు
ఈ ప్రభుత్వం ఇసుక కోసం, మద్యం కోసం ఆలోచిస్తుంది
కానీ మహిళల భద్రత కోసం కనీసం పట్టించుకోవడం లేదు
ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
- తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై చర్చ
- ఉద్యోగుల బదిలీపై కసరత్తు జరుగుతోంది
- ఏపీకి చెందిన 1,942మంది తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి
- తెలంగాణకు చెందిన 1447 మంది ఏపీకి వచ్చేందుకు సుముఖత
- ఉద్యోగుల వన్ టైమ్ రిలీవ్ కోసం తెలంగాణను కోరాం
- తెలంగాణ నుంచి సమాధానం రావాల్సి ఉంది-మంత్రి పయ్యావుల కేశవ్
మండలి: పంట నష్టపరిహారంపై వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్న
గతంలో రైతులకు సమయానికి నష్టపరిహారం అందేది: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడు నష్టపోతే అదే సీజన్‌లో అందించాం
ఇప్పుడు మళ్లీ రైతులకు సకాలంలో నష్ట పరిహారం ఇవ్వడం లేదు
ఇటీవల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందరికి ఇవ్వలేదు
నష్టం అంచనా కూడా భారీగా తగ్గించి రైతులకు నష్టం చేశారు
మండలిలో వైఎస్సార్‌సీపీ ఆందోళన
- శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ ఆందోళన
- మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం ఘటన పై మంత్రి సత్య ప్రసాద్ వ్యాఖ్యలు
- మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ను ప్రస్తావించడం పై వైసీపీ ఎమ్మెల్సీ ల ఆగ్రహం
- ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
- విచారణ జరుగుతుంది అన్నారు
- విచారణ లో ఉన్నప్పుడు పేర్లు ఎలా చెప్తారు
- విచారం లో తెలాక మాట్లాడండి
- ప్రతి ఒక్కరి మీద బురద చల్లడం ఏంటి?
- రికార్డుల నుండి పెద్దిరెడ్డి పేరు ను తొలగించాలి
- పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడాలని శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు సూచన
ఉద్యోగుల సమస్యలపై చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టు
తక్షణమే ఉద్యోగుల సమస్యల పై చర్చించాలి: ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
108, 104, అంగన్‌డీ, ఆశా వర్కర్ల సమస్యల పై చర్చించాలి
ఈ రోజే ఈ అంశం పై చర్చించాలి
ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు
టీ బ్రేక్ లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన చైర్మన్ మోషేన్ రాజు
చైర్మన్ హామీతో ఆందోళన విరమించిన వైసీపీ ఎమ్మెల్సీ లు
మండలిలో వాయిదా తీర్మానం తిరస్కరణ.. వైఎస్సార్‌సీపీ నిరసన
శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ
శాసస మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల నిరసన
అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, 108, 104 ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని డిమాండ్
ఏడోరోజు.. ప్రారంభమైన అసెంబ్లీ
- ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- ఏడో రోజు సమావేశాలు ప్రారంభం
- ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైన సమావేశాలు
- శాసనసభలో నాలుగు బిల్లులపై చర్చ
ఏపీ శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
- ఏపీ శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
- అంగన్‌వాడీ, ఆశావర్కర్లు 108,104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వాయిదా తీర్మానం
ఇది మోసాల బడ్జెట్.. సర్కారును మండలిలో నిలదీసిన విపక్ష వైఎస్సార్‌సీపీ
- మీరు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్తు చార్జీలను తగ్గించకపోగా.. ప్రజలపై రూ.17 వేల కోట్లకుపైగా కరెంట్ భారం వేస్తారా?
- అప్పులపైనా అడ్డగోలుగా అబద్ధాలు చెబుతారా?.. ఇది మోసాల బడ్జెట్
- నిన్న(సోమవారం)సర్కారును మండలిలో నిలదీసిన విపక్ష వైఎస్సార్‌సీపీ
- విద్యుత్తు చార్జీల పెంపు, సూపర్ సిక్స్ హామీలకు ఎగవేతలు, దిగజారిన శాంతి భద్రతలపై దద్దరిల్లిన శాసన మండలి
- ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షం వాకౌట్
- ఎన్నికల హామీ ప్రకారం ప్రజలపై చార్జీల భారం వేయకుండా సబ్సిడీగా ప్రభుత్వమే భరించాలని విపక్ష నేత బొత్స డిమాండ్
- బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన పీడీఎఫ్.. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకున్న అధికార పక్షం
ఇవాళ 7వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న శాసనసభ
ప్రశ్నోత్తరాలు
ఉద్యోగుల అంతర్ రాష్ట్ర బదిలీలు
సాగునీటి కాల్వల నిర్వహణ
ఆక్వా రైతులపై పన్ను విధింపు
విద్యార్థులకు ఆర్థిక సహాయం
కడప జిల్లాలో ఎస్సీ,ఎస్టీ లకు వాహనాల పంపిణీ
ఐటీడీఏ ప్రాజెక్ట్ పాడేరు.. పిలేరు నియోజక వర్గంలో అడవిపల్లి ప్రాజెక్ట్
చేనేత కార్మికులకు ప్రోత్సాహకాలు
కార్మిక సంక్షేమం మండలి
డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకంపై ప్రశ్నోత్తరాలు
పలు డిపార్ట్‌మెంట్లకు సంబందించిన డిమాండ్లపై ఆయా శాఖల మంత్రుల వివరణ
ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ సోసైటిస్ చట్ట సవరణ బిల్లు -2024
ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు -2024
ఆంధ్ర ప్రదేశ్ ప్రోహిబిషన్ చట్టసవరణ బిల్ల- 2024
ఆంధ్ర ప్రదేశ్ ఇండియా మెడ్ లిక్కర్, ఫారన్ మెడ్ లిక్కర్ చట్ట సవరణ బిల్లు-2024
రిషికొండపై భవనాలు నిర్మాణం పై స్వల్ప కాలిక చర్చ
రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్, ఇతర సాగునీటి ప్రాజెక్ట్ లపై స్వల్పకాలిక చర్చ