సాక్షి, గుంటూరు: శానస మండలిలో పంట నష్టపరిహారంపై కూటమి సర్కార్‌ను శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు నిలదీశారు. గతంలో రైతులకు సమయానికి నష్టపరిహారం అందేదని.. కూటమి ప్రభుత్వం వచ్చిన రైతులకు సకాలంలో నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు.
52 లక్షల మంది రైతులకు 10,500 కోట్లకు పైగా ఇవ్వాలని.. కానీ బడ్జెట్ లో 4500 కోట్లు పెట్టారన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. రైతులకు ఎప్పుడు నుంచి పెట్టుబడి సాయం అందిస్తారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ రామససుబ్బారెడ్డి మాట్లాడుతూ, రైతులకు రూ.20 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ కేంద్రంతో కలిపి రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. ఖరీఫ్, రబీ పోయింది కానీ, ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment