అనకాపల్లి: హతవిధీ.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎంత దుర్గతి పట్టింది. పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుండగా అసలే టీడీపీ పరిస్థితి దీనంగా ఉంది. దానికి తోడు జనసేనతో పొత్తు బెడిసికొట్టి ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా గోడ దూకేస్తున్న దుస్థితి. అందుకే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ‘కొత్త’ నాటకానికి తెర తీశారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు.. (పాత సీసాలో కొత్త సారా అనాలేమో) ఇప్పటికే పార్టీలో ఉన్న వారికి కండువాలు కప్పి కొత్తగా చేరినట్టు బిల్డప్ ఇస్తున్నారు.
బుధవారం నాటి నాటకంలో పాత్రధారులు పాత కాపులే అన్న సంగతి తెలియడంతో అందరూ విస్తుపోతున్నారు. సిహెచ్.నాగాపురం గ్రామంలో అయ్యన్నపాత్రుడి సమక్షంలో వైఎస్సార్‌సీపీ నుంచి 10 మంది టీడీపీలో చేరినట్టు ప్రచారం చేశారు. తీరా చూస్తే టీడీపీ కండువాలు కప్పుకున్న వారంతా గతంలో తమ పార్టీకి చెందిన వారు కావడంతో స్థానిక తెలుగుదేశం నేతలు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది.
నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక వేస్తున్న ఎత్తులతో నవ్వువులపాలయ్యామని పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. సిహెచ్.నాగాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులే మళ్లీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో పార్టీలో చేరడం చాలా సిగ్గుచేటుగా ఉందని నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురాం ఎద్దేవా చేశారు.
ఆయన గురువారం విలేకర్లుతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఉప్పులూరి రంగా, కులం రాము, కంకిపూడి మంగరాజు, చంటిబాబు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, వీరితో పాటు మరో నలుగురు 2019లో అయ్యన్నపాత్రుడు గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులేనని తెలిపారు. వీరికే మళ్లీ టీడీపీ కండువాలు కప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఉప సర్పంచ్ సుబ్రమణ్యం తదితర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment