AP: అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా | ap assembly budget sessions Tenth Day Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

AP: అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

  • ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • సభను నిరవధిక వాయిదా వేసిన స్పీకర్‌
2024-11-22 15:21:04

మీరు కాదన్న.. ప్రతిపక్ష పార్టీ ఉంది: లక్ష్మణరావు

  • లోకాయుక్త సవరణ బిల్లుపై  పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యంతరం
  • ఎమ్మెల్సీ లక్ష్మణరావు కామెంట్స్‌..
  • ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా కీలకమైంది
  • లోకాయుక్త నియామక కమిటీలో ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేయడం సమంజసం కాదు.
  • ప్రతిపక్ష నాయకుడు లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడు ఉండాలి
  • ప్రతిపక్ష పార్టీ సభ్యుడు లేకుండా లోకాయుక్త నియామకం చేపట్టడం కరెక్ట్‌ కాదు
  • పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం నేను చెబుతున్నాను.
  • మీరు కాదన్న.. ప్రతిపక్ష పార్టీ ఉంది.
  • ఖచ్చితంగా ప్రతిపక్ష సభ్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
2024-11-22 13:26:48

మండలి నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్‌

  • పీఏసీ ఎన్నికలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ వాకౌట్‌
  • సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు తెలిపిన ఎమ్మెల్సీ బొత్స 
2024-11-22 13:14:27

మంత్రి సవిత వివాదాస్పద వ్యాఖ్యలు..

  • మంత్రి సవిత వివాదాస్పద వ్యాఖ్యలు.
  • మండలిలో మంత్రి సవిత వివాదాస్పద వ్యాఖ్యలు
  • డీబీటీ నిధులతో  రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు
  • మంత్రి సవిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
  • మహిళలను కించపరిచేలా మంత్రి సవిత మాట్లాడటంపై ఆందోళన
  • మహిళలకు మంత్రి సవిత క్షమాపణ చెప్పాలని డిమాండ్‌.
  • మంత్రి సవిత వ్యాఖ్యలపై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం
  • డీబీటీ వల్ల మహిళలు గంజాయికి అలవాటు పడ్డారన్న వ్యాఖ్యలను రికార్డులో నుండి తొలగిస్తున్నట్టు ప్రకటించిన చైర్మన్
  • ఆందోళనల నేపథ్యంలో సభను వాయిదా వేసిన చైర్మన్
     
2024-11-22 11:33:36

ప్రతిపక్ష ఎమ్మెల్యేకి పీఏసీ చైర్మన్ ఇవ్వడం సంప్రదాయం: బొత్స

  • మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్‌..
  • పీఏసీని చాలా సదుద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిచారు
  • ప్రజాస్వామ్య స్ఫూర్తితో దీనిని పెట్టారు
  • వాళ్ళు చేసిన పద్దులను వాళ్ళ పార్టీ వాళ్లే చూసుకుంటాం అంటే ఎలా?
  • ప్రతిపక్ష ఎమ్మెల్యేకి పీఏసీ చైర్మన్ ఇవ్వడం సంప్రదాయం
  • మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ దేశమైన సరే ప్రతిపక్షానికి పీఏసీ ఇస్తారు
  • తాలిబన్లు మాత్రమే ఇవ్వలేదు
  • వీళ్లు అదే సంప్రదాయం పాటిస్తారా?
  • ప్రజాస్వామ్యం లేదని, ఈ ప్రభుత్వం సంప్రదాయాలను తుంగలో తొక్కింది
  • ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి మేము ఓటింగ్ బాయ్ కాట్ చేస్తున్నాం
  • ఇలాంటి చెడు సంప్రదాయం తీసుకురావడం సమంజసం కాదు
  •  
2024-11-22 11:33:36

పీఏసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: పెద్దిరెడ్డి

  • అసెంబ్లీలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్‌..
  • ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ ఇవ్వడం లేదు
  • ఇప్పటివరకు ప్రతిపక్షానికి పి ఏ సి చైర్మన్ ఇచ్చారు
  • ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు అనేక సార్లు పీఏసీ చైర్మన్ ఇచ్చారు
  • పార్లమెంట్ లో సైతం ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు పీఏసీ చైర్మన్ అనేక పర్యాయాలు ఇచ్చారు
  • పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంది
  • అందుకే ఆనవాయితీగా ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇచ్చారు
  • ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటా ప్రతిపక్షానికే పీఏసీ ఇచ్చారు
  • తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్థాన్‌లో మాత్రమే ప్రతిపక్షానికి  పీఏసీ లేదు
  • పార్లమెంట్‌లో అనేక కుంభకోణాలు పీఏసీనే వెలికి తీసింది
  • 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం పీఏసీనే బయటపెట్టింది
  • కోల్ గేట్ స్కామ్ కూడా బయటపెట్టింది
  • కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం కూడా పీఏసీనే వెలికితీసింది
  • 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్‌కి పీఏసీ చైర్మన్ ఇచ్చారు
  • మాకు గతంలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కి పీఏసీ చైర్మన్ ఇచ్చాం
  • సభలో ప్రతిపక్ష హోదా అడిగిన ఇవ్వలేదు
  • పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టం
  • అందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
2024-11-22 11:33:36

మండలిలో వైఎస్సార్‌సీపీ ఆందోళన

  • వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానాలను తిరస్కరించిన మండలి ఛైర్మన్‌
  • సోషల్‌మీడియా కార్యకర్తలపై పెట్టిన కేసులపై చర్చించాలని వాయిదా తీర్మానం
  • ప్రభుత్వ పాఠశాలల పనితీరు వేళల్లో మార్పుపై చర్చకు వాయిదా తీర్మానం
  • ఈ రెండు వాయిదా తీర్మానాలను తిరస్కరించిన మండలి ఛైర్మన్‌ మోషేను రాజు
  • వాయిదా తీర్మానాలపై చర్చించాలని పోడియం వద్ద సభ్యుల ఆందోళన
2024-11-22 11:14:29

‘PAC’కి కొనసాగుతున్న పోలింగ్‌

  • అసెంబ్లీ కమిటీల్లో సభ్యుల ఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్‌
  • ఒక్కొరుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఎమ్మెల్యేలు
  • ఎమ్మెల్యేలు ఏ సంఖ్యా క్రమంలో ఓటు వేయాలనేదానిపై విప్‌లకు బాధ్యత
  • ఎమ్మెల్యేలు ఓటు వేయడంపై విప్‌లకు బాధ్యత అప్పగించిన ఎన్డీయే కూటమి
  • పీఏసీ, పీయూసీ, అంచనాల కమిటీల్లో సభ్యుల ఎన్నికకు పోలింగ్‌
  • అసెంబ్లీ కమిటీ హాలులో మధ్యాహ్నం 2 వరకు పోలింగ్‌
  • బ్యాలెట్‌ పద్ధతిలో ఎమ్మెల్యేల ఓట్లు నమోదు
2024-11-22 10:03:39

సంప్రదాయానికి టీడీపీ తూట్లు

  • సంప్రదాయానికి విరుద్ధంగా టీడీపీ నిర్ణయం
  • పీఏసీ ని అధికార పార్టీ దక్కించుకునేందుకు ప్రయత్నం
  • ప్రజా పద్దుల కమిటీ కి ఎన్నిక అనివార్యం
  • 1966 నుండి ఉన్న సంప్రదాయానికి విరుద్ధంగా టీడీపీ నిర్ణయం
  • పి ఏ సి చైర్మన్ వైసీపీ కి రాకుండా టీడీపీ ప్లాన్
  • ఎమ్మెల్యే కోటాలో 9 సభ్యుల స్థానాలకు 10 నామినేషన్లు దాఖలు
  • ప్రతిపక్ష వైసీపీ నుండి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి నామినేషన్
  • టీడీపీ తరఫున  శ్రీరాం రాజగోపాల్, బీవీ జయనాగేశ్వరరెడ్డి, అరిమిల్లి రాధా కృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు, కోళ్ల లలితకుమారి నామినేషన్
  • జనసేన తరఫున పీఏసీ సభ్యత్వానికి పులవర్తి రామాంజనేయులు నామినేషన్
  • బీజేపీ తరఫున పీఏసీ సభ్యత్వానికి నామినేషన్ వేసిన విష్ణు కుమార్ రాజు
  • ఏకగ్రీవం కాకపోవడం తో నేడు ఎమ్మెల్యేలకు ఓటింగ్ నిర్వహించే అవకాశం
  • ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే కు పి ఏ సి చైర్మన్ రాకుండా ఓటింగ్ ని తెరపైకి తెచ్చిన టీడీపీ
  • ప్రజా పద్దుల కమిటీ ని అధికార పార్టీ చేతుల్లోనే పెట్టుకునేందుకు టీడీపీ ప్లాన్
2024-11-22 10:03:39

సోషల్‌ మీడియా అక్రమ కేసులపై వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం

  • సోషల్‌ మీడియా అక్రమ కేసులపై వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
  • రాష్ట్రంలో సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు
  • అక్రమ కేసులపై సభలో చర్చించాలని కోరుతూ మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
2024-11-22 09:40:16

నేడు పీఏసీ కమిటీలపై పోలింగ్‌..

  • నేడు అసెంబ్లీలో పీఏసీ మూడు కమిటీలపై ఒంటి గంట వరకు జరగనున్న పోలింగ్..
  • మధ్యాహ్నం రెండు గంటలకు ఫలితాల వెల్లడి..
  • ప్రతీ సభ్యుడు పోలింగ్‌లో పాల్గొనాలని కోరిన స్పీకర్
2024-11-22 09:38:16

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

  • అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
  • పదోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 
2024-11-22 09:16:22
Advertisement
 
Advertisement
 
Advertisement