సాక్షి, అనకాపల్లి: విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదైంది. 304, 305, 188, 204 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. జాతర పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పోలీసులపై రెచ్చిపోయారు. కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని పోలీసులు కోరడంతో రెచ్చిపోయిన అయ్యన్న నానా హంగామా సృష్టించారు. ఎస్సైని తోసేయడంతోపాటు, అసభ్యకరంగా మాట్లాడారు. మరో రెండేళ్లు అంటూ పోలీసులకు హెచ్చరికలు జారీచేశారు. కాగా, అయ్యన్న పాత్రుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment