
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 2019 లో బీజేపీ గెలిచినా కానీ.. గత ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీ రాదని తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి ఉన్నామని.. ఇరు పార్టీలు పంతాలకు పోతే ప్రజలు నష్ట పోతారని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో.. కలహాలు ఉన్నా కాపురం చేయక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా ఆయ్యన్నపాత్రుడు జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment