సాక్షి, విశాఖపట్నం: ఎక్కడో నక్కిన నర్సీపట్నం పిల్లి బయటకు రావాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అన్నారు. ‘మీ నాయకుడు లోకేశ్ నర్సీపట్నం పులిగా అభివర్ణిస్తున్నాడే. ఇంతకీ నువ్వు నర్సీపట్నం పులివా.. పిల్లివా లేదా ఊరకుక్కవా?. నీ మాటలు చూస్తే ఊరకుక్కలాగే ఉన్నాయి’ అని అయ్యన్నపాత్రుడిపై విరుచుకుపడ్డారు.
శనివారం విశాఖ మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. , గంజాయి మత్తులో అయ్యన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెన్ని భూకబ్జాలు చేశారో సిట్ త్వరలోనే తేలుస్తుందన్నారు. విశాఖలో భూకబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment