Chengala Venkat Rao
-
‘నర్సీపట్నం పిల్లి బయటకు రావాలి’
సాక్షి, విశాఖపట్నం: ఎక్కడో నక్కిన నర్సీపట్నం పిల్లి బయటకు రావాలని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అన్నారు. ‘మీ నాయకుడు లోకేశ్ నర్సీపట్నం పులిగా అభివర్ణిస్తున్నాడే. ఇంతకీ నువ్వు నర్సీపట్నం పులివా.. పిల్లివా లేదా ఊరకుక్కవా?. నీ మాటలు చూస్తే ఊరకుక్కలాగే ఉన్నాయి’ అని అయ్యన్నపాత్రుడిపై విరుచుకుపడ్డారు. శనివారం విశాఖ మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. , గంజాయి మత్తులో అయ్యన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెన్ని భూకబ్జాలు చేశారో సిట్ త్వరలోనే తేలుస్తుందన్నారు. విశాఖలో భూకబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ చొరవతో పూజరి శైలజకు న్యాయం -
వైన్ వీర ‘అనితా’... మాటలు జాగ్రత్త...! : మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్ అన్నారు. తండ్రి సమానుడైన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కత్తెర చూపిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని... బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలంతా కత్తితో నీ నాలుక చీరేస్తారని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన ఎంవీపీ కాలనీలో గల తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. సజ్జల కష్టపడి తన ప్రతిభతో ఈ స్థాయికి ఎదిగారని, అలాంటి వ్యక్తిని బ్రోకర్ అని సంబోధిస్తావా..? అసలు పవిత్రమైన టీచర్‌గా పనిచేసిన నీవు పాయకరావుపేట ఎమ్మెల్యే స్థాయికి ఎలా ఎదిగావో నియోజకవర్గ ప్రజలను అడిగితే చెబుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే మద్యం బ్రాండ్లు మంచివి కాదని చెబుతున్న వైన్ వీర వనితకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలన్నారు. ఏలేరు కాలువ అవకతవకల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ముందస్తుగా స్టే తెచ్చుకున్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. కాపు కులస్తులపై కపటప్రేమ ఇటీవల చంద్రబాబు, వైన్ వీర ‘అనిత’ కాపు కులస్తులపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. కాపు కులస్తుడైన తన భర్తను పోలీస్‌స్టేషన్‌లో చెప్పుతో కొట్టడమే కాకుండా... జైలుకు పంపించిన ఘనత ఈ వీర వనితదని గుర్తుచేశారు. ఇక చంద్రబాబు అయితే కాపు నాయకుడు వంగవీటి మోహన్‌రంగాను హత్య చేయించారన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడైన వంగవీటి రాధను చంపాలని కుట్ర పన్నుతున్నాడని తెలిపారు. తండ్రిని హతమార్చినట్టే.. అమాయకుడైన వంగవీటి రాధని హతమార్చి కాపుల ఓట్లతో సీఎం అవ్వాలని చంద్రబాబు మరో కుట్ర పన్నుతున్నాడన్నారు. ఈ కుట్రపై సీఐడీ విచారణ చేయించాలని సీఎం జగన్మోహన్రెడ్డిని కోరతానన్నారు. అప్పుడే వీరి కుట్ర బయటపడుతుందన్నారు. చదవండి: Crime: పగలు రెక్కీ.. రాత్రికి చోరీ! తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా.. -
అనకాపల్లి కోర్టు సంచలన తీర్పు
-
అనకాపల్లి కోర్టు సంచలన తీర్పు
విశాఖపట్నం: ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసులో అనకాపల్లి సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు సహా 15 మందికి జీవితఖైదు విధించింది. మరో ఐదుగురికి రెండేళ్ల జైలు శిక్ష వేసింది. పదేళ్ల క్రితం నక్కపల్లి మండలంలో బంగారమ్మపేటలో బీఎంసీ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో గోసల కొండ అనే మత్స్యకారుడు మృతి చెందాడు. అతడి మరణానికి నాటి ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అనుచరులే కారణమని కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన అనకాపల్లి సెషన్స్ 10వ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. నందమూరి బాలకృష్ణ హీరోగా చెంగల వెంకట్రావు నిర్మించిన ‘సమరసింహారెడ్డి’ సినిమా విజయవంతం కావడంతో ఆయన వెలుగులోకి వచ్చారు. తర్వాత టీడీపీలో చేరారు. 1999, 2004 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా చెంగల ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్ల బాబూరావు చేతిలో ఓడిపోయారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. -
దర్శకుడు రాజమౌళి తండ్రికి నాన్ బెయిలబుల్ వారెంట్!
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు నాంపల్లి క్రిమినల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. నిర్మాత చెంగల వెంకట్రావు దాఖలు చేసిన చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు గైర్హాజరు కావడంతో వారెంట్ ను జారీ చేసింది. ఓ సినిమా కథ కోసం చెంగల వెంకట్రావు వద్ద విజయేంద్ర ప్రసాద్ 41 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అయితే తమ మధ్య ఒప్పందంను ఉల్లంఘించడం జరగడం, సొమ్ము వెనక్కి తిరిగి ఇవ్వకపోవడంతో కేసు నమోదు చేశారు. ఆంధ్ర బ్యాంక్ కు చెందిన రెండు చెక్కులను విజేంద్ర ప్రసాద్.. చెంగల కు ఇచ్చారని.. అవి బౌన్స్ కావడంతో .. విజయేంద్ర ప్రసాద్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు.