
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్ అన్నారు. తండ్రి సమానుడైన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కత్తెర చూపిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని... బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలంతా కత్తితో నీ నాలుక చీరేస్తారని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన ఎంవీపీ కాలనీలో గల తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. సజ్జల కష్టపడి తన ప్రతిభతో ఈ స్థాయికి ఎదిగారని, అలాంటి వ్యక్తిని బ్రోకర్ అని సంబోధిస్తావా..? అసలు పవిత్రమైన టీచర్‌గా పనిచేసిన నీవు పాయకరావుపేట ఎమ్మెల్యే స్థాయికి ఎలా ఎదిగావో నియోజకవర్గ ప్రజలను అడిగితే చెబుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే మద్యం బ్రాండ్‌లు మంచివి కాదని చెబుతున్న వైన్ వీర వనితకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలన్నారు. ఏలేరు కాలువ అవకతవకల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ముందస్తుగా స్టే తెచ్చుకున్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు.
కాపు కులస్తులపై కపటప్రేమ
ఇటీవల చంద్రబాబు, వైన్ వీర ‘అనిత’ కాపు కులస్తులపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. కాపు కులస్తుడైన తన భర్తను పోలీస్‌స్టేషన్లో చెప్పుతో కొట్టడమే కాకుండా... జైలుకు పంపించిన ఘనత ఈ వీర వనితదని గుర్తుచేశారు. ఇక చంద్రబాబు అయితే కాపు నాయకుడు వంగవీటి మోహన్‌రంగాను హత్య చేయించారన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడైన వంగవీటి రాధను చంపాలని కుట్ర పన్నుతున్నాడని తెలిపారు. తండ్రిని హతమార్చినట్టే.. అమాయకుడైన వంగవీటి రాధని హతమార్చి కాపుల ఓట్లతో సీఎం అవ్వాలని చంద్రబాబు మరో కుట్ర పన్నుతున్నాడన్నారు. ఈ కుట్రపై సీఐడీ విచారణ చేయించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కోరతానన్నారు. అప్పుడే వీరి కుట్ర బయటపడుతుందన్నారు.
చదవండి: Crime: పగలు రెక్కీ.. రాత్రికి చోరీ! తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా..
Comments
Please login to add a commentAdd a comment