మంత్రిగా లోకేశ్‌కు సలహాలు ఇస్తా... | ayyanna patrudu satisfied with panchayati raj ministry | Sakshi
Sakshi News home page

మంత్రిగా లోకేశ్‌కు సలహాలు ఇస్తా...

Published Tue, Apr 4 2017 3:32 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

మంత్రిగా లోకేశ్‌కు సలహాలు ఇస్తా... - Sakshi

మంత్రిగా లోకేశ్‌కు సలహాలు ఇస్తా...

విశాఖ : రోడ్లు భవనాల శాఖలో అందరి సమన్వయంతో పనిచేస్తానని ఆ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. అన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణ జరిగిందని, అందరికీ పదవులు ఇవ్వడం కష్టమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తనకు కేటాయించిన ఆర్‌అండ్‌బీ శాఖ సంతృప్తికరంగా ఉందన్నారు. ఎన్టీఆర్‌ కుటుంబంలోని మూడు తరాల వారితో పనిచేయడం ఆనందంగా ఉందని అయ్యన్నపాత్రుడు అన్నారు.

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉన్నందున... కొత్తగా ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్‌కు మంత్రిగా సలహాలు ఇస్తానని అయ్యన్న తెలిపారు. కాగా ఏపీ మంత్రివర్గ పునరవ్యవస్థీకరణలో భాగంగా చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్‌ కోసం పంచాయతీ రాజ్‌ శాఖను కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే అయ్యన్న ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన పంచాయతీరాజ్‌ శాఖను చిన్నబాబు లోకేశ్‌కు కేటాయింపుతో ఆ శాఖను అయ్యన్న త్యాగం చేయాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement