డ్యాన్సర్లతో టీడీపీ మంత్రి చిందులు.. వీడియో వైరల్‌ | AP Minister Ayyanna Patrudu Public Dance Goes Viral | Sakshi
Sakshi News home page

డ్యాన్సర్లతో టీడీపీ మంత్రి చిందులు.. వీడియో వైరల్‌

Published Fri, Apr 13 2018 12:43 PM | Last Updated on Fri, Apr 13 2018 12:47 PM

AP Minister Ayyanna Patrudu Public Dance Goes Viral - Sakshi

డ్యాన్సర్లతో అయ్యన్నపాత్రుడు

సాక్షి, విశాఖ: రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చిందులేశారు. ఆయన చిందులేసింది అధికారులపై కాదు.. డ్యాన్లర్లతో కలిసి రోడ్డుపై అదిరేటి స్టెప్పులంటూ కాలుకదిపారు. ప్రజాప్రతినిధి అని మర్చిపోయిన మంత్రి ఇటీవల విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళా డ్యాన్సర్లతో చిందులేసి ఇరగదీశారు. అంతటితో ఆగకుండా డ్యాన్సర్లపై డబ్బులు కూడా విసిరారు. డప్పు దరువుకు అనుగుణంగా లయబద్దంగా ఆయన చేసిన డ్యాన్స్‌ వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మరోవైపు ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన బాటపడితే.. రాష్ట్ర మంత్రి అయుండి ఇలా చిందులు వేయడమేంటని పలువురు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా గతంలో టీడీపీ మంత్రులు కొందరు మహిళా ఉద్యోగినులపై దౌర్జన్యం చేసి పరువు తీస్తే, ఇపుడు మంత్రి అయ్యన్న రోడ్లపై డ్యాన్సర్లతో చిందులేసి ఉన్న కాస్త పరువు తీశారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement