
సాక్షి, చిత్తూరు: టీడీపీ అయ్యన్నపాత్రుడిపై డిప్యూటీ నారాయణ స్వామి సీరియస్ అయ్యారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. సంస్కారం లేని వ్యక్తి అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
కాగా, నారాయణ స్వామి మాట్లాడుతూ..‘రాబోయే ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయం. అయ్యన్నపాత్రుడు సంస్కారం లేని వ్యక్తి. ఓడిపోతామనే భయంతో మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. తాను కాబోయే హోం మంత్రిని అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయ్యన్నపాత్రుడు తన భాషను మార్చుకోవాలి. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అంటూ కామెంట్స్ చేశారు.
మరోవైపు.. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కూడా ఆగ్రహ వ్యక్తం చేశారు. ఆయన ఒక సైకో, శాడిస్డు అని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు పెద్ద సైకోలు అని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు చరిత్ర అందరికి తెలుసని, నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చిన చరిత్ర ఆయనదని విమర్శలు గుప్పించారు. అయ్యన్న కంటే మేము బూతులు మాట్లాడగలము. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment