
file photo
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిపై త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీపై ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడిపై ఏయూ జేఏసీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జేఏసీ ఫిర్యాదు మేరకు అయ్యన్నపై కేసు నమోదు చేశారు. అయ్యన్నకు 41 కింద నోటీసులు ఇవ్వడానికి త్రీటౌన్ పోలీసులు నర్సీపట్నం వెళ్లారు. పోలీసులు వెళ్లిన సమయంలో ఇంటిదగ్గర అయ్యన్న లేకపోవడంతో అయ్యన్న కుటుంబసభ్యులకు నోటీస్ విషయాన్ని పోలీసులు తెలియపర్చారు.
చదవండి: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న
Comments
Please login to add a commentAdd a comment