
సాక్షి, తాడేపల్లి: అధికారంలో ఉండగా అయ్యన్న పాత్రుడు అక్రమాలకు పాల్పడి, అడ్డంగా దొరికిపోయారని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాన్ని కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. అయ్యన్న పాత్రుడి అరెస్ట్‌తో బీసీలకు సంబంధమేంటి అని ప్రశ్నించారు.
కులంకార్డు అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. మీరు తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలని కోరారు. రాష్ట్రంలో టీడీపీ నేతలకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా?. తప్పచేసిన వారిపై చర్యలు తీసుకోకూడదా అన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రశ్నించారు.
చదవండి: (అనంతపురం దుర్ఘటన.. విద్యుత్ శాఖకు సీఎం జగన్ కీలక ఆదేశాలు)
Comments
Please login to add a commentAdd a comment