సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. రెండు రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. శనివారం రాష్ట్ర ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండ్రోజులుగా దూరంగా ఉన్నారు.
బడ్జెట్‌ను శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెడతారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో కేసీఆర్ డిసెంబర్ 8న జారిపడి గాయపడ్డారు. తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్.. ఈనెల 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే కేసీఆర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈమేరకు బులెటిన్ కూడా విడుదలైంది. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment