సాక్షి, అమరావతి : టీడీపీ నాయకులు ప్రజావేదిక గురించి మరిచిపోవడమే మంచిదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రజా వేదిక గురించి మాట్లాడటం వల్ల టీడీపీకి ఏమైనా మేలు జరుగుతుందని అనుకుంటే అది పొరపాటే అవుతుందని పేర్కొన్నారు. శాననమండలి ప్రశ్నోత్తరాల సమయంలో భవానీ ద్వీపం అభివృద్ధిపై ఆయన మాట్లాడుతూ.. భవానీ ఐలాండ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చే ప్రతి భక్తుడు భవానీ ద్వీపాన్ని సందర్శించుకునేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే విమానం నిలిపివేశామని టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారు. కానీ బాబు ప్రభుత్వం ఆ విమాన సంస్థకు 2 కోట్ల బకాయి పడి.. దానిని చెల్లించలేకపోవడం వల్లే రద్దు చేశాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment