సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకుని, దానిని గవర్నర్ ఆమోదించిన తరువాత న్యాయస్థానానికి జోక్యం చేసుకునే అధికారం లేదని శ్రీకాకుళానికి చెందిన ఉరిటి లక్ష్మీ శైలజ.. హైకోర్టులో అధికార వికేంద్రీకరణపై రైతులు దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి మంగళవారం ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. గతంలో హైకోర్టే అనేక కేసుల్లో ప్రభుత్వం, గవర్నర్ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషన్‌లో పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 12, 13 ఆర్టికల్స్ ప్రకారం ప్రభుత్వం చేసిన చట్టాల్లో కోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని, ఆర్టికల్ 14 ప్రకారం ప్రజా హక్కులకు భంగం కలిగితే జోక్యం చేసుకునే అవకాశముందని పిటిషనర్ తరఫు న్యాయవాది చీమకుర్తి చంద్రశేఖర్ తెలిపారు. 3 రాజధానుల ఏర్పాటు వలన ఎ క్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని, అమరావతిలో మాత్రమే రాజధానిని ఉంచడం వలన ఒక్క ప్రాంతం వారికే ప్రయోజనం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment