
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభ నిరవధిక వాయిదా పడింది. మార్చి 5న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడినట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. మొత్తం 19 రోజుల్లో 133.58 గంటల పాటు శాసన సభ జరిగిందని వివరించారు. మొత్తం 166 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగా, తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సభలో ప్రభుత్వం 5 తీర్మానాలు చేసింది. మొత్తం 103 మంది సభ్యులు మాట్లాడారు.