వీళ్లేమైనా ‘తాగి వచ్చారా?’ | Eshwarappa fire on members of the ruling party | Sakshi
Sakshi News home page

వీళ్లేమైనా ‘తాగి వచ్చారా?’

Published Fri, Feb 6 2015 8:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

వీళ్లేమైనా ‘తాగి వచ్చారా?’

వీళ్లేమైనా ‘తాగి వచ్చారా?’

అధికార పక్ష సభ్యులపై ఈశ్వరప్ప గరం
 
బెంగళూరు :  ‘వీళ్లేమైనా తాగి వచ్చారా’ అధ్యక్షా అంటూ  అధికార పక్ష సభ్యులపై విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప మండిపడ్డారు. గురువారం ఉదయం పరిషత్ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ప్రవీణ్ తొగాడియా నగర ప్రవేశ నిషేధం అంశంపై చర్చ కొనసాగింది. ఈ చర్చకు అడ్డుతగులుతున్న అధికార పక్ష సభ్యులపై ఈశ్వరప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ప్రవీణ్ తొగాడియా ఓ దేశభక్తుడు, ఆయన మాట్లాడేందుకు ఈ రాష్ట్రంలో అవకాశం లభించలేదంటే ఈ రాష్ట్రం భారత్‌లో ఉన్నట్లా? లేక పాకిస్తాన్‌లోనా?’ అంటూ ప్రశ్నించారు.

 

దీంతో ఈశ్వరప్ప ప్రసంగానికి అధికాపక్ష సభ్యులు అడ్డుతగిలారు. ఈ పరిణామంతో మరింత ఆగ్రహానికి లోనైన ఈశ్వరప్ప ‘వీళ్లేమైనా తాగి వచ్చారా? అధికార పక్ష సభ్యులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?’ అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చట్టసభల్లో ప్రతిపక్ష నేతలు ఈ విధంగా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం కాదని, ఈశ్వరప్ప వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement