సాక్షి, అమరావతి :తమ ప్రభుత్వానిది సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధిని అందించే మానవీయ బడ్జెట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘ఇది అక్క చెల్లెమ్మలు, రైతన్నల పక్షపాత బడ్జెట్.. గ్రామ స్వరాజ్య బడ్జెట్.. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సామాజిక న్యాయ బడ్జెట్’ అని చెప్పారు.
శుక్రవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా రూపొందించి అమలు చేస్తున్నట్టుగానే 2023–24లోనూ మానవీయ బడ్జెట్‌ను అందించామన్నారు. కచ్చితంగా సంక్షేమ కేలండర్‌ను ప్రకటించి ఆ మేరకు అన్ని వర్గాల లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తున్నామని చెప్పారు. తాము ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావిస్తున్న మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి గత నాలుగేళ్లుగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ, ఆ పనులు పూర్తి చేస్తూ వచ్చామని తెలిపారు. గత నాలుగు బడ్జెట్‌లలోనూ ఇదే మానవత్వం కనిపించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment