
సమస్యలపై గళమెత్తుతాం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా శాసనసభలోకి అడుగుపెట్టే అవకాశం కల్పించిన ప్రజల రుణం తీర్చుకుంటామని జిల్లా ఎమ్మెల్యేలు చెప్పారు. అసెంబ్లీలో జిల్లా ప్రజల తరఫున గళం వినిపిస్తామని స్పష్టం చేశారు.
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా శాసనసభలోకి అడుగుపెట్టే అవకాశం కల్పించిన ప్రజల రుణం తీర్చుకుంటామని జిల్లా ఎమ్మెల్యేలు చెప్పారు. అసెంబ్లీలో జిల్లా ప్రజల తరఫున గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. ఆయా అంశాలను అసెంబ్లీలో లేవనెత్తడంతోపాటు సంబంధిత మంత్రులు, అధికారులతో సమావేశమై వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జిల్లాలోని శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించబోయే అంశాలు వారి మాటల్లోనే..
జోగు రామన్న (ఆదిలాబాద్)
పెన్‌గంగా ప్రాజెక్టు నుంచి నియోజకవర్గ గ్రామాలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తా.
సీసీఐ పునరుద్ధరణ కోసం ప్రభుత్వంతో చర్చిస్తా.
నియోజకవర్గంలోని రోడ్లు, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాను.
రాథోడ్ బాపురావు (బోథ్)
రోడ్ల నిర్మాణానికి సంబంధించి నిధుల మంజూరుకు కృషి.
ఆదివాసీ గూడాల్లో నీటి సౌకర్యానికి విన్నవిస్తా.
నియోజకవర్గంలోని జలపాతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి.
వర్షాకాలంలో వైద్య సౌకర్యాలు ఆదివాసీలు, ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు సీఎం దృష్టికి తీసుకువెళతా.
జి.విఠల్‌రెడ్డి (ముథోల్)
ఖరీఫ్ సీజన్‌లో విత్తనాల సౌలభ్యం కల్పించాలని డిమాండ్ చేస్తా.
ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులు, సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం నినదిస్తా.
పోచంపాడులో మునిగిన గ్రామాల్లోని లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యాన్ని బాగుచేయించాలని విన్నవిస్తా.
రోడ్ల సౌకర్యం కల్పించాలి.
మంజూరైన పెన్షన్‌లు పొందడం కోసం అవస్థలను ప్రస్తావిస్తా.
ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్)
అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ సౌకర్యం కోసం కృషి.
నియోజకవర్గంలోని అర్హులకు ఇళ్ల స్థలాలు, ఇళ ్ల కేటాయింపు కోసం కృషి.
టీఆర్‌ఎస్ మేనిఫెస్టో అమలుకు ఒత్తిడి.
అజ్మీర రే ఖ (ఖానాపూర్)
వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రస్తావిస్తా.
బడిఈడు పిల్లలకు విద్య అందించేందుకు పూర్తి ఏర్పాట్లు
నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, సాగునీరు అందించేందుకు
కోనప్ప (సిర్పూర్)
పెండింగ్ ప్రాజెక్టులైన కొమురం భీమ్, జగన్నాథపూర్, ప్రాణహిత-చేవెళ్లను పూర్తి చేయాలి.
పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వారికి పట్టాలు ఇప్పించాలి.
పట్టణంలో నీటి సమస్యను తీర ్చడానికి పైపులైన్లను కేటాయించాలి.
కోవ లక్ష్మి (ఆసిఫాబాద్)
నియోజకవర్గంలో నెలకొన్న విద్య, వైద్యం, తాగునీరు సమస్యలను ప్రస్తావిస్తా.
నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులు పూర్తిచేసే దిశగా అసెంబ్లీలో ప్రస్తావిస్తాను.
మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించే దిశగా కృషి.
నల్లాల ఓదెలు (చెన్నూర్)కోటపల్లి మండలంలోని రహదారులపై వంతెనల నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి
అన్ని మండలాలకు గోదావరి తాగునీటికి కృషి
సింగరేణి ఉద్యోగులకు సకలజనుల సమ్మె వేతనం, ఐటీ మినహాయింపు కోసం తీర్మానం, డిపెండెంట్ ఉద్యోగాల కల్పనకు కృషిచే స్తా.
సాగునీరు, తాగునీరు సౌలభ్యం కల్పించేలా ప్రతిపాదనలు
దివాకర్‌రావు (మంచిర్యాల)
ఎల్లంపెల్లి ప్రాజెక్టుల పునరావాసం
ఓపెన్‌కాస్ట్ నిర్వాసితులకు పరిహారం
సింగరేణి ఉద్యోగులకు ఐటీ మినహాయింపు కోసం అసెంబ్లీ తీర్మానం
పట్టణంలో నీటి సమస్య పరిష్కారానికి కావాల్సిన నిధుల సాధన
దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి)
ఓపెన్‌కాస్ట్‌ల తొలగింపుకు ప్రతిపాదిస్తాను
బెల్లంపల్లి జిల్లా కేంద్రం చేయాలని అసెంబ్లీలో కోరుతాను
సింగరేణి ఉద్యోగుల డిమాండ్లను ప్రస్తావిస్తాను.