మీడియాపై ఆంక్షల పట్ల జగన్ ఆగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మీడియాపై ఆంక్షలు విధించడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులు ఆయన వద్ద ఆంక్షల విషయం ప్రస్తావించారు. దీనికి జగన్ స్పందిస్తూ.. ఆంక్షలు విధించడం సరైన పద్థతి కాదని అన్నారు.
ప్రజా సమస్యలపై అభిప్రాయాలు వెల్లడించే హక్కు సభ్యులకు ఉంటుందని చెప్పారు. సభలో సభ్యుల గొంతు నొక్కినప్పుడు ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించడం వంటివి చేస్తారని, వాటిని ప్రసారం చేయకూడదని నియంత్రించడం సరికాదని జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.