
గౌరిబిదనూరు : ఈ నియోజక వర్గంలో 14 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. అందులో ఒక్కసారి మాత్రం మహిళా అభ్యర్థిని ఎన్నిక చేసి కర్ణాటక శాసనసభకు పంపారు. ఆమె జ్యోతిరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జడ్జి వరదారెడ్డి కుమార్తె జ్యోతిరెడ్డి సొంతూరు చిత్తూరు జిల్లా పుంగనూరు. అయితే ఈమె హిందూపురంలో కళాశాల విద్యనభ్యసించింది. ఈమె అమ్మమ్మ ఇల్లు ఇదే తాలూకా నాగసంద్రం. ఈమె తాత ఎన్‌సీ నాగయ్యరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి మొదటి ఎమ్మెల్యేగా 1952లో కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించారు. ఇదిలా ఉంటే జ్యోతిరెడ్డి భర్త రాజగోపాలరెడ్డి స్వగ్రామం కూడా నాగసంద్ర కావడంతో ఇక్కడే వచ్చి స్థిరపడ్డారు. అప్పటి నుంచి రాజకీయలపై దృష్టి సారించారు. 1989లో జేడీఎస్ అభ్యర్థిగా బరిలోకి ఓటమి పాలయ్యారు. తిరిగి 1994లో జేడీఎస్ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. ఈమె ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జ్యోతిరెడ్డి బీజేపీలో కొనసాగుతున్నార
Comments
Please login to add a commentAdd a comment