woman candidate
-
ఆమెకు వంట మాత్రమే తెలుసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగింది. దావణగెరె స్థానం నుంచి బరిలో బీజేపీ అభ్యర్థికి "వంటగదిలో వంట చేయడం మాత్రమే తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కోడలు ప్రభా మల్లికార్జున్ కోసం ఆయన ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దావణగెరె స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తత ఎంపీ జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను బరిలోకి దింపింది. గాయత్రి సిద్దేశ్వర ఉద్దేశించి ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ‘ఆమె ఎన్నికల్లో గెలిచి (ప్రధాని) మోదీకి కమలం అందించాలనుకుంటోందని మీ అందరికీ తెలుసు. ముందు దావణగెరె సమస్యలను అర్థం చేసుకోండి. ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి పనులు చేశాం. మీకు మాట్లాడటం తెలియదు. కిచెన్‌లో వంట చేయడం మాత్రమే తెలుసు. ప్రతిపక్ష పార్టీకి బహిరంగంగా మాట్లాడే శక్తి లేదు" అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శివశంకరప్ప తనపై చేసిన వ్యాఖ్యలపై గాయత్రి సిద్దేశ్వర స్పందిస్తూ.. ప్రస్తుతం మహిళలు అన్నింటా రాణిస్తున్నారని, కానీ మహిళలు వంటింట్లోనే ఉండాలి అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఇంట్లోని మగవాళ్లకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ ఎంత ప్రేమగా వంట చేస్తారో ఆయనకు తెలియదన్నారు. మహిళలు స్వతంత్రంగా ఎదగడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహం అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. -
ఓటుకు నోటు ఇవ్వలేను.. మీరే నాకివ్వండి
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో ఓటుకు నోటు ఇస్తున్న అభ్యర్థులకు భిన్నంగా ఓ మహిళా అభ్యర్థి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓటుతో పాటు ఎన్నికల ఖర్చు కోసం నోటు ఇవ్వడంటూ అభ్యర్థించే పనిలో పడ్డారు. నాగపట్నం జిల్లా తిరుత్తురై పూండి అసెంబ్లీ నియోజకవర్గంలో నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా ఆర్తీ పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె వినూత్న బాటను ఎంచుకున్నారు. ఓటుకు నోటు ఇచ్చే స్థితిలో తాను లేనని, అయితే, గెలిపిస్తే అందరికీ మంచి చేస్తానని ప్రసంగాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కొన్ని లక్షలు ఖర్చుపెట్టుకోవచ్చని సూచించిందని, ఆ మొత్తం కూడా తన వద్ద లేదని వాపోతున్నారు. అంతేకాదు, ఓటుతో పాటు ఎన్నికల ఖర్చు నిమిత్తం తనకు విరాళంగా ఎంతో కొంత ఇవ్వాలని ప్రజల్ని అభ్యర్థిస్తూ ముందుకు సాగే పనిలో పడ్డారు. గురువారం ఇదే తరహాలో ఆమె తిరుత్తురై పూండి మార్కెట్ పరిసరాల్లో ప్రచారంలో ముందుకు సాగారు. దీంతో ఆమె ప్రసంగం, ఆమె అభ్యర్థనకు స్పందించిన అక్కడి వర్తకులు తమకు తోచినట్టుగా రూ. వంద, రూ. ఐదు వందలు అంటూ ఎన్నికల ఖర్చునిమిత్తం ఆర్తీకి విరాళం అందించడం విశేషం. అమ్మ వరమిచ్చింది... సహకార శాఖ మంత్రిగానే కాదు థర్మాకోల్ మంత్రిగా ముద్రపడ్డ సెల్లూరు రాజు తాను పోటీ చేస్తున్న మదురై ఉత్తరం నియోజకవర్గం పరిధిలో ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. గురువారం ఆయన పలంగానత్తం పరిసరాల్లో ప్రచారం చేశారు. ఆయనకు హారతి పట్టేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు పూనకం వచ్చినట్టుగా ఊగిపోయింది. సెల్లూరు రాజు వైపు దూసుకొచ్చి అమ్మ వరమిచ్చేసింది..గెలుపు నీదే అంటూ పెద్ద పెద్దగా కేకలు పెట్టింది. దీంతో ఆమెను ఓ శాలువతో సెల్లూరు సత్కరించారు. ఆయన సత్కరించి అటు వెళ్లగానే, ఆ శాలువతో ఆ వృద్ధురాలు పరుగులు తీయడం గమనార్హం. అన్నాడీఎంకే పరమకుడి అభ్యర్థి సదన్ ప్రభాకర్ ఓటర్లను ఆకర్షించేందుకు గురువారం ఓ మాంసం దుకాణంలో పనిచేశారు. మాంసాన్ని ముక్కలుగా కత్తిరించి విక్రయించే పనిలోపడ్డారు. అలాగే పక్కనున్న హోటల్లో పరోటా మాస్టర్ అవతారమెత్తారు. చదవండి: తమిళనాడు ఎన్నికలు : మీ జీవితంలో ఇలాంటి హామీలు వినుండరు ‘సాగర్’.. సస్పెన్స్: పోటీదారులెవరో..? -
మహిళా సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
సాక్షి, ఆదిలాబాద్ : తెలంగాణ రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో ఓటమి పాలయ్యాననే మనస్తాపంతో ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ముత్నురు తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. ముత్నురు తండాకు చెందిన కళాబాయి అనే మహిళ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసింది. ఈ శుక్రవారం జరిగిన రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో ఆమె ఓటమిపాలైంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించిన బంధువులు ఆమెను రిమ్స్‌కు తరలించారు. -
శాసనసభకు తెలుగింటి కోడలు
గౌరిబిదనూరు : ఈ నియోజక వర్గంలో 14 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. అందులో ఒక్కసారి మాత్రం మహిళా అభ్యర్థిని ఎన్నిక చేసి కర్ణాటక శాసనసభకు పంపారు. ఆమె జ్యోతిరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జడ్జి వరదారెడ్డి కుమార్తె జ్యోతిరెడ్డి సొంతూరు చిత్తూరు జిల్లా పుంగనూరు. అయితే ఈమె హిందూపురంలో కళాశాల విద్యనభ్యసించింది. ఈమె అమ్మమ్మ ఇల్లు ఇదే తాలూకా నాగసంద్రం. ఈమె తాత ఎన్సీ నాగయ్యరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి మొదటి ఎమ్మెల్యేగా 1952లో కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించారు. ఇదిలా ఉంటే జ్యోతిరెడ్డి భర్త రాజగోపాలరెడ్డి స్వగ్రామం కూడా నాగసంద్ర కావడంతో ఇక్కడే వచ్చి స్థిరపడ్డారు. అప్పటి నుంచి రాజకీయలపై దృష్టి సారించారు. 1989లో జేడీఎస్ అభ్యర్థిగా బరిలోకి ఓటమి పాలయ్యారు. తిరిగి 1994లో జేడీఎస్ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. ఈమె ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జ్యోతిరెడ్డి బీజేపీలో కొనసాగుతున్నార -
లోక్ సభ యుద్ధానికి ఒకే ఒక్క మహిళ
షిల్లాంగ్: పురుషుల కన్నా ఎక్కువ సంఖ్యలో మహిళా ఓటర్లున్న మేఘాలయలో ఏ పార్టీ కూడా మహిళలకు టికెటివ్వలేదు. దాంతో ఓ మహిళ ఇండిపెండెంట్‌గా షిల్లాంగ్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. భారీ సంఖ్యలో మహిళా ఓటర్లున్నమేఘాలయలో షిల్లాంగ్, తుర అనే రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. షిల్లాంగ్ నుంచి బరిలో ఉన్న 8 మందిలో 65 ఏళ్ల ఐవోరిన షైల్లా ఒక్కరే మహిళా అభ్యర్థి. మహిళలె వ్వరికీ టిక్కెటివ్వకపోవడం వల్లనే తాను బరిలో దిగానని, మహిళల సమస్యలు, వారి హక్కులే తన అజెండా అని ఆమె స్పష్టం చేస్తున్నారు. బీజేపీ మహిళా మోర్చాకు గతంలో ఆమె అధ్యక్షురాలిగా వ్యవహరించారు. తుర స్థానాన్ని సిటింగ్ ఎంపీ అగాథా సంగ్మా తన తండ్రి, మాజీ స్పీకర్ అయిన పీఏ సంగ్మా కోసం త్యాగం చేశారు. గతంలో పీఏ సంగ్మా ఆ స్థానం నుంచి 9 సార్లు గెలుపొందారు. అగాథా సంగ్మా 15వ లోక్‌సభలో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా ఉన్నారు.