షిల్లాంగ్: పురుషుల కన్నా ఎక్కువ సంఖ్యలో మహిళా ఓటర్లున్న మేఘాలయలో ఏ పార్టీ కూడా మహిళలకు టికెటివ్వలేదు. దాంతో ఓ మహిళ ఇండిపెండెంట్‌గా షిల్లాంగ్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. భారీ సంఖ్యలో మహిళా ఓటర్లున్నమేఘాలయలో షిల్లాంగ్, తుర అనే రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. షిల్లాంగ్ నుంచి బరిలో ఉన్న 8 మందిలో 65 ఏళ్ల ఐవోరిన షైల్లా ఒక్కరే మహిళా అభ్యర్థి. మహిళలె వ్వరికీ టిక్కెటివ్వకపోవడం వల్లనే తాను బరిలో దిగానని, మహిళల సమస్యలు, వారి హక్కులే తన అజెండా అని ఆమె స్పష్టం చేస్తున్నారు. బీజేపీ మహిళా మోర్చాకు గతంలో ఆమె అధ్యక్షురాలిగా వ్యవహరించారు.
తుర స్థానాన్ని సిటింగ్ ఎంపీ అగాథా సంగ్మా తన తండ్రి, మాజీ స్పీకర్ అయిన పీఏ సంగ్మా కోసం త్యాగం చేశారు. గతంలో పీఏ సంగ్మా ఆ స్థానం నుంచి 9 సార్లు గెలుపొందారు. అగాథా సంగ్మా 15వ లోక్‌సభలో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా ఉన్నారు.