7, 8 తేదీల్లో సీమాంధ్ర తుది జాబితా | seemandhra final list will announce very soon | Sakshi
Sakshi News home page

7, 8 తేదీల్లో సీమాంధ్ర తుది జాబితా

Published Sun, Apr 6 2014 12:15 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

seemandhra final list will announce very soon

రఘువీరారెడ్డి వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబి తా ఈ నెల 7, 8 తేదీల్లో ప్రకటించనున్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి శనివారం ఇక్కడ తెలిపారు. అభ్యర్థుల జాబితాలపై పీసీసీ ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తోందని, ఇప్పటికే తొలివిడ త కొన్ని స్థానాల జాబితాను అధిష్టానానికి పంపామని చెప్పారు. మిగిలిన వాటిపై కూడా జాబితాను పూర్తిచేసి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వనున్నామన్నారు. స్థానిక ఇందిరాభవన్‌లో దివంగత జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అభ్యర్థుల జాబి తాతో పాటు మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నట్టు రఘువీరా వివరించారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement