సీఎం కొన్నిరోజులు మాట్లాడరు
బెంగళూరు: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడరు. చాలాకాలం నుంచి దగ్గు సమస్యతో బాధపడుతున్న కేజ్రీవాల్ బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీలో సర్జరీ చేయించుకున్నారు. కేజ్రీవాల్ గొంతుకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించామని వైద్యులు తెలిపారు. కొన్ని రోజుల పాటు మాట్లాడకుండా ఉండాలని ఆయనకు వైద్యులు సూచించారు.
కేజ్రీవాల్ నాలుక సాధారణ పరిమాణం కంటే పెద్దగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన నోటి పరిమాణం కంటే నాలుక కొంచెం పెద్దగా ఉందని చెప్పారు. కేజ్రీవాల్ గొంతు పైభాగంలో చిన్న కండరానికి సర్జరీ చేసినట్టు తెలిపారు. ఆయన కోలుకునే పరిస్థితిని బట్టి ఎప్పటి నుంచో మాట్లాడవచ్చో వైద్యులు నిర్ణయిస్తారు. సర్జరీ చేయించుకునేందుకు కేజ్రీవాల్ ఇటీవల బెంగళూరుకు వెళ్లారు.